
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ఇంట్లోకి అగంతకుడు చొరబడడం కలకలం రేపుతోంది. ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలంకరైలో విజయ్ ఇంటి అగంతకుడు టెర్రస్‌పై తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది ఆయన నివాసంలో బాంబ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టింది. ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, 24 ఏళ్ల మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. ఈ ఘటనను సంబంధించి ఓ పోలీసు సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మానసిక ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. గట్టి భద్రతా ఏర్పాట్లను దాటి ఆ వ్యక్తి విజయ్ ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగాడన్న దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
విజయ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ Y-కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. విజయ్.. గత శనివారం తిరుచ్చిలో రాష్ట్రవ్యాప్తంగా తన రాజకీయ పర్యటనను ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరగడంతో ఆయన భదత్రా విషయంలో అభిమానులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.