
5000 వేల ఏళ్ల క్రితం నాటి ఆట ఒకటి తమిళనాడులో పునరాగమనం చేయడమే కాదు బాగా పాపులర్ అవుతోంది. చోళుల కాలం నాటి ఈ ఆట పేరు... ఆట్య పట్య. శారీరక దారుఢ్యం, ఐక్యతకు అద్దం పట్టే ఈ ఆటను ‘నత్రినై’ అని కూడా పిలుస్తారు. తమిళ ప్రాచీన సాహిత్యంలో ఈ ఆటకు సంబంధించిన ఎన్నో విశేషాలు కనిపిస్తాయి.
పదిహేనుమందితో రెండు జట్లు ఆడే ఈ ఆట చురుకుదనం, వ్యూహం, క్రమశిక్షణకి గీటురాయిగా నిలిచింది. పెద్దల నోటి నుంచి ఆట్య పట్య గురించి విన్న యువతరం వేల ఏళ్ల నాటి ఆటకు ప్రాణం పోశారు. తమిళనాడులోని వివిధ జిల్లాలలో యువతరమే కాదు పిల్లలు కూడా ఆట్య పట్య ఆడుతున్నారు. ఈ ఆట ఎలా ఆడాలి అనేదాని గురించి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు ఉన్నాయి.