250 మెగావాట్స్ పవర్ ప్లాంట్ సొంతం చేసుకున్న ఎంఈఐఎల్ | TAQA to sell 250MW Lignite Power Plant To MEIL Energy | Sakshi
Sakshi News home page

250 మెగావాట్స్ పవర్ ప్లాంట్ సొంతం చేసుకున్న ఎంఈఐఎల్

Oct 30 2025 5:39 PM | Updated on Oct 30 2025 6:28 PM

TAQA to sell 250MW Lignite Power Plant To MEIL Energy

తమిళనాడులో నేవేలి వద్ద 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొనుగోలు చేసింది. అబుదాబి కేంద్రంగా ఉన్న సంస్థ నుంచి వందశాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎంఈఐఎల్ గురువారం ప్రకటించింది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఎంఈ ఐఎల్ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ఎనర్జీ) తమిళనాడులోని నేవేలిలో ఉన్న టిఏక్యూఏ నేవెలీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (టిఏక్యూఏ నేవెలీ) సంస్థను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ పిజెఎస్‌సి (టిఏక్యూఏ) నుంచి 100 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది.

ఈ స్వాధీన ప్రక్రియ ఎంఈఐఎల్ గ్రూప్ వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు. ఒక పెద్ద ఈపీసి కాంట్రాక్టర్ నుంచి అంతర్గతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యాజమాన్యం, నిర్వహణలో నిమగ్నమైన సమగ్ర ఇన్‌ఫ్రా డెవలపర్‌గా మారే దిశలో కీలకమైన అడుగుగా ఎంఈఐఎల్ చేసిన ఈ  కొనుగోలు నిలుస్తోంది.

టిఏక్యూఏ నేవెలీ 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లిగ్నైట్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని తమిళనాడులోని నేవెలీ ప్రాంతంలో నిర్వహిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రానికి ఆ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిరంతర, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించడంలో ఈ యూనిట్ స్థిరమైన పనితీరు రికార్డును ఇప్పటికే నెలకొల్పింది.

ప్రస్తుతం ఇంధన రంగంలో 5.2 గిగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యాన్ని  ఎంఈఐఎల్ కలిగి ఉంది. తమిళనాడు ప్లాంట్ కొనుగోలు  ద్వారా ఈ రంగంలో తన స్థానాన్ని సంస్థ మరింత బలపరుచుకుంటోంది. అలాగే, దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు  స్థిరమైన, భారీ స్థాయిలో పనిచేసే ఉత్పత్తి ఆస్తుల పోర్ట్‌ఫోలియోను నిర్మించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

టిఏక్యూఏ నేవెలీని తన ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి ఆపరేషన్లలో సులభంగా సమన్వయం చేయడాన్ని ఎంఈఐఎల్ ఎనర్జీ ప్రాధాన్యంగా తీసుకుంటోంది. దీని ద్వారా ఆపరేషనల్ ఎక్సలెన్స్, సమర్థవంతమైన ఆస్తి నిర్వహణ తదితరాలకు సంస్థ కట్టుబడింది.

ఈ సందర్భంగా ఎంఈఐఎల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సలిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ''ఉన్నత నాణ్యత గల విద్యుత్ ఉత్పత్తి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఈపీసీ రంగంలో మా అత్యుత్తమ నైపుణ్యాన్ని మౌలిక సదుపాయాల యాజమాన్యంతో కలిపి వ్యూహాత్మక మార్పు సాధించడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుంది. మా ప్రధాన దృష్టి, దేశీయ ఇంధన భద్రతను పెంపొందించే, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించే, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధికి మద్దతు ఇచ్చే వ్యూహాత్మక పెట్టుబడులపై కొనసాగుతుంది. థర్మల్, హైడ్రో, పునరుత్పాదక శక్తి రంగాలను సమన్వయం చేసే సమతులిత, స్థిరమైన విద్యుత్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాము'' అని అన్నారు. టిఏక్యూఏ నేవెలీ స్వాధీనం మా ఆర్గానిక్, ఇనార్గానిక్ వృద్ధి వ్యూహాలకు అనుగుణంగా ఉంది. భారత విద్యుత్ రంగంపై మాకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది అని అన్నారు.

ఎంఈఐఎల్ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక శక్తి, మౌళిక సదుపాయాలు, తయారీ, నీటి నిర్వహణ తదితర రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్తులో భారత ఇంధన స్వావలంబన, ఆర్థిక స్థిరత్వంకు తోడ్పడే అవకాశాలను పరిశీలించి ముందుకు సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement