ఇన్వెస్టర్ల మనసంతా ఆ ఇన్వెస్టింగ్‌పైనే.. | Axis Mutual Fund Reports Strong Growth in Index Fund AUM | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్ల మనసంతా ఆ ఇన్వెస్టింగ్‌పైనే..

Apr 13 2026 1:15 PM | Updated on Apr 13 2026 1:32 PM

Axis Mutual Fund Reports Strong Growth in Index Fund AUM

ముంబై: పారదర్శకమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్‌ ఇన్వెస్టింగ్‌పై మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తమ సంస్థ వివిధ సూచీల ఆధారిత ఫండ్స్‌ని అందిస్తున్నట్లు వివరించింది.

2026 ఫిబ్రవరి 28 నాటికి వీటిలో నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ ఏయూఎం రూ. 849 కోట్లకు, 100 ఇండెక్స్‌ ఫండ్‌ ఏయూఎం రూ. 1,983 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022 జనవరిలో ప్రవేశపెట్టిన నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఫండ్‌ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఇవి లార్జ్‌ క్యాప్‌ మొదలుకుని వివిధ స్థాయుల్లో మార్కెట్‌కి ప్రాతినిధ్యం వహించే, భవిష్యత్తులో లీడర్లుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.

యాక్టివ్‌గా మేనేజ్ చేసే ఫండ్స్‌తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్స్‌లో హ్యూమన్ ఎర్రర్ (నిర్ణయాల్లో పొరపాట్లు) తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త తరం ఇన్వెస్టర్లు తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియో (నిర్వహణ వ్యయం) కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement