మళ్లీ ఎంఎంటీసీ.. రూ.10కే డిజిటల్‌ గోల్డ్, సిల్వర్‌! | MMTC-PAMP Relaunches Digital Gold and Silver Platform Buy from Just 10 | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎంఎంటీసీ.. రూ.10కే డిజిటల్‌ గోల్డ్, సిల్వర్‌!

May 8 2026 9:05 PM | Updated on May 8 2026 9:11 PM

MMTC-PAMP Relaunches Digital Gold and Silver Platform Buy from Just 10

డిజిటల్‌ రూపంలో బంగారం, వెండిని నేరుగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఎంఎంటీసీ–పీఏఎంపీ ప్లాట్‌ఫామ్‌ తిరిగి ప్రారంభమైంది. ఎంఎంటీసీపీఏఎంపీ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్‌ యాప్‌ నుంచి, అలాగే గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే యాప్స్‌ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

ఈ సంస్థ డిజిటల్‌ గోల్డ్‌ ప్లాట్‌ఫామ్‌ను మొదటిసారి 2017లో, డిజిటల్‌ వెండి కొనుగోళ్లకు 2023లో అవకాశం కల్పించింది. మరింత మెరుగైన అనుభవానికి వీలుగా వెబ్‌సైట్‌ను నవీకరించేందుకు 2024 చివర్లో ఈ సేవలను నిలిపివేసింది. ఈ కాలంలో థర్డ్‌ పార్టీ (ఫోన్‌పే తదితర) యాప్స్‌ ద్వారా కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. నవీకరించిన వెబ్‌సైట్‌ను తాజాగా ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది.

కనీసం రూ.10 నుంచి డిజిటల్‌ గోల్డ్, సిల్వర్‌ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతీ కొనుగోలు విలువకు సరిపడా భౌతిక బంగారం, వెండిని బీమా రక్షణతో కూడిన ఖజానాల్లో ఎంఎంటీసీ–పీఏఎంపీ భద్రపరుస్తుంది. బంగారం, వెండిపై పెట్టుబడులకు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో ఎంఎంటీసీ తిరిగి ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement