జెరోధా మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్ 50:50 ఇండెక్స్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్‌ను కేదార్‌నాథ్ మిరాజ్‌కార్ నిర్వహించనున్నారు. ఈ ఫండ్ అధిక రిస్క్ కిందకు వస్తుంది.
నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్ 400 50:50 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.
జియో బ్లాక్‌రాక్ లార్జ్‌క్యాప్ ఫండ్
జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా జియో బ్లాక్‌రాక్ లార్జ్‌క్యాప్ ఫండ్‌ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్ 7న ముగుస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్‌ఈ 100 ఇండెక్స్ (టీఆర్‌ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.
తన్వి కచేరియా, సాహిల్ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్‌ప్లాన్ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.


