EPF కనీస పెన్షన్ పెంపు.. పార్లమెంటు కమిటీ కీలక సిఫార్సులు | EPF Pension of Rs 1000 Deemed Inadequate Panel Urges Increase | Sakshi
Sakshi News home page

EPF కనీస పెన్షన్ పెంపు.. పార్లమెంటు కమిటీ కీలక సిఫార్సులు

Mar 17 2026 7:03 PM | Updated on Mar 17 2026 7:39 PM

EPF Pension of Rs 1000 Deemed Inadequate Panel Urges Increase

ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 (EPS, 1995) కింద.. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్స్‌టైల్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.

ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అందుతున్న మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని, దాన్ని రూ.7,500కు పెంచాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది.

కనీస పెన్షన్‌పై ఇప్పటికే పెన్షనర్ల నుంచి పలు విజ్ఞాపనలు వచ్చినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కనీస మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995ని పునః సమీక్షించి పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కేటాయింపులు చేయాలని సూచించింది.

ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!

Advertisement
 
Advertisement
Advertisement