ఆన్‌లైన్‌ పేమెంట్‌ అలర్ట్‌.. గంట తర్వాతే చెల్లింపులు! | RBI proposes one hour delay in digital transactions above Rs 10000 | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ పేమెంట్‌ అలర్ట్‌.. గంట తర్వాతే చెల్లింపులు!

Apr 10 2026 11:31 AM | Updated on Apr 10 2026 12:30 PM

RBI proposes one hour delay in digital transactions above Rs 10000

డిజిటల్‌ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఆర్‌బీఐ కీలక చర్యలు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. డిజిటల్‌ లావాదేవీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే ఒక గంట తర్వాతే దాన్ని అమలు చేసే విధానం (ల్యాగ్‌) ఉండాలని ప్రతిపాదన తెచ్చింది.

వద్దనుకుంటే గంటలోపు విజయవంతం కాకముందే దాన్ని రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సైబర్‌ నేరస్థులు డెబిట్‌ చేసుకునేట్టు అయితే ఆ లావాదేవీల సమాచారం కస్టమర్లకు ముందే తెలుస్తుంది. అలాగే, మ్యూల్‌ ఖాతాలకు చెక్‌ పెట్టేందుకు ఒక ఖాతాలోకి వచ్చే మొత్తం జమలపై పరిమితులను ప్రతిపాదించింది. మెరుగైన శ్రద్ధ లేని ఖాతాలకు వార్షిక క్రెడిట్లను సుమారు రూ .25 లక్షలకు పరిమితం చేయాలని సూచించింది.

ఒకే క్లిక్‌తో అన్ని డిజిటల్‌ చెల్లింపులను నిలిపివేసే (కిల్‌ స్విచ్‌) విధానాన్ని పేర్కొంది. ఇక 70 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులను మోసపుచ్చి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఖాతా నుంచి మళ్లించకుండా, ఆయా లావాదేవీలకు విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా అదనపు ధ్రువీకరణను తీసుకువచ్చే ప్రతిపాదనను చేసింది. రూ .50,000 లకు మించిన లావాదేవీల విషయంలో వినియోగదారులకు నిధులను బదిలీ చేయడానికి ముందు నామినేటెడ్ వ్యక్తి నుండి అనుమతి అవసరం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement