మారనున్న పాన్ కార్డు రూల్స్.. కేంద్రం కఠిన నిబంధనలు! | PAN Rules: Know The Changes From 2026 April 1st | Sakshi
Sakshi News home page

మారనున్న పాన్ కార్డు రూల్స్.. కేంద్రం కఠిన నిబంధనలు!

Mar 21 2026 3:05 PM | Updated on Mar 21 2026 4:15 PM

PAN Rules: Know The Changes From 2026 April 1st

భారతదేశంలో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కోసం దరఖాస్తు చేసే విధానంలో.. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆధార్ కార్డును ఉపయోగించి.. పాన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉండేది. అయితే మార్చి 31 తరువాత అదనంగా గుర్తింపుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ కొత్త నియమాల ప్రకారం.. PAN కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి ఆధార్‌తో పాటు మరో గుర్తింపు కార్డును తప్పనిసరిగా సమర్పించాలి. ఇందులో బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి సర్టిఫికేట్ లేదా మేజిస్ట్రేట్ ఇచ్చే అఫిడవిట్ వంటి పత్రాలు ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న సరళమైన విధానం కంటే కాస్త కఠినమైన ధృవీకరణ ప్రక్రియగా మారనుంది.

Image

కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి..  PAN కార్డులో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరుతో పూర్తిగా సరిపోవాలి. ఇంతకు ముందు చిన్న మార్పులు లేదా వేరియేషన్లు ఉన్నా పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ ఏప్రిల్ నుంచి అలాంటి అసమానతలకు అవకాశం ఉండదు. ఇది వ్యక్తుల గుర్తింపు వివరాలను మరింత ఖచ్చితంగా నమోదు చేయడానికి తీసుకున్న చర్యలలో భాగం అని తెలుస్తోంది.

సైబర్ నేరాలు
ఇటీవల కాలంలో ఈ పాన్ డౌన్‌లోడ్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. సెకన్ల వ్యవధిలో పాన్ డౌన్‌లోడ్ చేసుకోండంటూ.. కొందరు సైబర్ నేరగాళ్లు కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. ఆ లింక్స్ నమ్మి ఓపెన్ చేయాలని చూస్తే యూజర్లు మోసపోతారు. అలాంటి మోసాలకు చెక్ పెట్టడంలో భాగంగానే.. కేంద్రం కొత్త డాక్యుమెంట్స్ కూడా అందించాలని ద్రువీకరించింది.

ఇదీ చదవండి: తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement