ప్రతి ఉద్యోగికి వ్యక్తిగత హెల్త్ ప్లాన్ ఉండాలి
అప్పుడే సమగ్రమైన రక్షణ
ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా కవరేజీ
రిటైర్మెంట్ తర్వాత కూడా నిశ్చింత
లేదంటే ఆర్థిక సంక్షోభం రిస్క్
వేతన జీవుల్లో చాలా మందికి యాజమాన్యం ఆఫర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకం. అంతేకాదు, దాన్నొక భరోసాగానూ చూస్తుంటారు. ఒక విధంగా ప్రీమియం తక్కువగా ఉండడం, కొన్ని చోట్ల యాజమాన్యాలు ప్రీమియంలో కొంత సబ్సిడీ ఇవ్వడం, మరికొన్ని సొంతంగా ప్రీమియం చెల్లిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తుంటాయి. దీంతో ఉద్యోగులు ఈ విషయంలో మరో ఆలోచన లేదన్నట్టు కనిపిస్తుంటారు.
కానీ, అసలు రిస్క్ ఎప్పుడంటే..? ఆ ఉద్యోగంతో బంధం తెగిపోయినప్పుడే. సంస్థే తొలగించొచ్చు. లేదంటే ఉద్యోగే రాజీనామా చేయొచ్చు. లేదా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ మరుసటి రోజు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేకుండా కొనసాగాల్సి వస్తుంది. చూడ్డానికి ఇదేమంత పెద్ద అంశంగా అనిపించకపోవచ్చు. మరో సంస్థలో చేరిన తర్వాత బీమా తీసుకోవచ్చులేనని అనుకోవచ్చు. కానీ, ఈ విరామ సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే రూ.లక్షలాది పొదుపు నిధి ఖర్చయిపోతుంది. లేదంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
ఇక రిటైర్మెంట్ వరకు సంస్థ బీమాపైనే ఆధారపడిన వారి పరిస్థితి మరింత సంక్లిష్టం. వృద్ధాప్యంలో ఏవైనా ఆరోగ్య సమస్యలతో తాజాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అదేమంత ఈజీ కాదు. ప్రీమియం భారీగానే ఉంటుంది. కనుక వేతన జీవులు వ్యక్తిగత ఆరోగ్య రక్షణ విషయం ఎలా వ్యవహరించాలో తెలిపే వెల్త్ స్టోరీ ఇది... – సాక్షి, వెల్త్
సంస్థల్లో ఉద్యోగులు అందరికీ ఆఫర్ చేసేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. కనుక స్టాండెలోన్ హెల్త్‌ప్లాన్‌తో పోల్చితే ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. కంపెనీకి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ నిలిచిపోతుంది. కొనసాగింపు ప్రయోజనాలేవీ ఉండవు. పాలసీ నియమ, నిబంధనలు అన్నవి ప్రతి ఉద్యోగికి అనుకూలమైనవిగా ఉండాలని లేదు. సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) ఎంత ఉండాలి?అందులో ప్రయోజనాలు, మినహాయింపులు, నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇవన్నీ ప్రైవేటు సంస్థ, బీమా సంస్థ కలసి తమ అంగీకారం మేరకు నిర్ణయిస్తుంటాయి. వారు ఆఫర్ చేసే ప్రయోజనాలు, పరిమితులకు ఉద్యోగులు తప్పనిసరిగా అంగీకారం తెలపాల్సిందే. ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలా వరకు కవరేజీ సమగ్రంగా ఉండదు. రూ.3–5 లక్షలకు మించదు. ఈ రక్షణ అందరికీ చాలకపోవచ్చు.
రిటైర్మెంట్ వరకు మేల్కొనకపోతే..
🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు.
🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి.
🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి.
🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు.
🔸 పెద్ద వయసులో క్లెయిమ్‌ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి.
🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు.
🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి.
🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి.
🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు.
🔸 పెద్ద వయసులో క్లెయిమ్‌ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి.
ముందే ఎందుకు..?
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా, ఏ వయసులో అయినా తీసుకోవచ్చు. కానీ 20–30ల్లో తీసుకుంటే చౌక ప్రీమియంతో వస్తుంది. అన్ని రకాల కవరేజీలను పొందొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కనుక ముఖ్యమైన కవరేజీలకు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ నిబంధనల గండాలను సులభంగా దాటేయొచ్చు. అందుకే ఆర్థిక నిపుణులు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణలను జోడించుకోవాలని బలంగా సూచిస్తుంటారు. పనిచేసే సంస్థ ఇచ్చే గ్రూప్ హెల్త్ ప్లాన్‌తో సంబంధం లేకుండా విడిగా కుటుంబం అంతటికీ వర్తించే విధంగా మెరుగైన రక్షణతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా.. మరో ఉద్యోగం వచ్చే వరకు, పదవీ విరమణ తర్వాత కూడా వ్యక్తిగత ఆరోగ్య బీమా రక్షణ నిశి్చంతగా కొనసాగుతుంది. కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పరిమితులు ఉంటాయి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలు, రిస్‌్కలకు అనుగుణంగా మెరుగైన రక్షణ సదుపాయాలతో ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
ఉదాహరణ..
🔸 35 ఏళ్ల వయసులో రూ.10 లక్షల హెల్త్ ప్లాన్‌కు ప్రీమియం రూ.8,000–12,000
🔸 60 ఏళ్ల వయసులో ఇంతే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.40,000–80,000 చెల్లించాల్సిందే.
🔸 60ల్లో ఆరోగ్య సమస్యలతో పాలసీ కొనుగోలు కష్టం కావొచ్చు.
యథార్థమిదీ..
🔸 హైదరాబాద్‌కు చెందిన రమేష్ వయసు 60 ఏళ్లు.
🔸 ఒక ప్రైవేటు సంస్థలో 30 ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నాడు.
🔸 ఇప్పటి వరకు సంస్థ ఇచి్చన గ్రూప్ హెల్త్ ప్లాన్ తప్ప విడిగా ఎలాంటి రక్షణ లేదు.
🔸 రమే‹Ùకు కొంత కాలం క్రితమే మధుమేహం, బీపీ బారినపడ్డాడు.
🔸 గత రెండేళ్లలోనే ఆరోగ్య సమస్యల కారణంగా అతడు రూ.6 లక్షలు తన రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఈ తప్పులకు దూరం దూరం..
🔸 కేవలం కంపెనీ బీమాపైనే ఆధారపడడం.
🔸 ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోకపోవడం.
🔸 బీమా కొనుగోలు చేసినా, ప్రీమియం తక్కువగా ఉండడం. కోసం సమ్ ఇన్సూర్డ్ రూ.3–5 లక్షలకే పరిమితం చేయడం.
🔸 తల్లిదండ్రుల బీమా అవసరాలను విస్మరించడం.
🔸 పెరుగుతున్న ఆదాయం, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను సమీక్షించుకోకపోవడం.
🔸 హెల్త్ ఇన్సూరెన్స్‌ను కేవలం పన్ను ఆదా సాధనంగా చూడడం.
🔸 ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ప్లాన్‌ను ప్రయోజనంగా కాకుండా పరిష్కారంగా చూడడం.
రక్షణ అవసరమైన మేర..
🔸 ప్రతి వేతన జీవి కనీసం రూ.10–20 లక్షలతో బేస్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి.
🔸 అది కూడా 25–35 ఏళ్ల వయసు మించకుండా తీసుకుంటనే బెటర్.
🔸 జీవిత భాగస్వామి, పిల్లలను తప్పకుండా అందులో భాగం చేయాలి. పెద్ద వయసులోని తల్లిదండ్రులు ఉంటే వారికంటూ విడిగా ప్లాన్ తీసుకోవాలి.
🔸 టాపప్ లేదా సూపర్ టాపప్ ప్లాన్‌తో అదనపు రక్షణను కల్పించుకోవాలి.
🔸 బేస్ పాలసీ కవరేజీ అంత డిడక్టబుల్ పెట్టుకుని రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలి. ఈ రెండింటిలో సూపర్ టాపప్ ఎక్కువ ప్రయోజనకరం.
🔸 ఒకవేళ బేస్ పాలసీ రూ.5 లక్షలు ఉంటే.. రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి.
🔸 దీనివల్ల ఎప్పుడైనా ఆస్పత్రిలో బిల్లు బేసిక్ కవరేజీని మించిపోతే అప్పుడు టాపప్ లేదా సూపర్ టాపప్ నుంచి చెల్లింపులు లభిస్తాయి.
🔸 రూ.5 లక్షల కవరేజీ చాలులే అనిపించొచ్చు. కానీ, వైద్య చికిత్సల చార్జీలు ఏటా 10–15 శాతం వరకు పెరుగుతున్నాయి. నేడు గుండె సర్జరీకి రూ.5 లక్షలు ఖర్చు అయితే.. పదేళ్ల తర్వాత రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
🔸 అందుకే తగినంత సమ్ ఇన్సూర్డ్‌తోపాటు ప్రతి మూడేళ్లకు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సమీక్షించుకోవాలి. తమ అవసరాలకు భరోసానిస్తుందా? అన్నది చూసుకోవాలి.


