ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పన్ను వర్తించే ఆదాయం పరిధిలో ఉన్న వారందరూ తప్పనిసరిగా చేయాల్సిన పని. అది కూడా గడువులోపు దాఖలు చేయడం ఉత్తమం. పన్ను వర్తించేంత ఆదాయం లేకపోయినా సరే, కొన్ని లావాదేవీల్లో (టీడీఎస్ తదితర) భాగస్వాములై ఉన్నా కానీ రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతేకాదు పన్ను వర్తించే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మించుతుంటే ముందస్తు పన్ను చెల్లింపుల బాధ్యత కూడా ఉంటుంది. కనుక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆదాయపన్ను నిబంధనల పాటింపునకు సంబంధించి కీలక తేదీలను ఒక్కసారి తెలుసుకుందాం.
మే 2026
మే 7: ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన టీడీఎస్/టీసీఎస్ డిపాజిట్ చేయాలి.
మే 15: ఏప్రిల్ నెలకు సంబంధించి శాలరీ (ఫారమ్ 16), ఇతర పేమెంట్లకు (ఫారమ్ 16ఏ) టీడీఎస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి.
మే 30: జనవరి–మార్చి 2026 త్రైమాసికానికి సంబంధించి టీసీఎస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి.
మే 31: అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీల నివేదిక (ఫారమ్ 61ఏ), ఆస్తి లావాదేవీల నివేదిక (ఫారమ్ 61బీ) దాఖలు చేయడానికి చివరి తేదీ. స్వచ్ఛంద సంస్థలు తమ విరాళాల నివేదికను (ఫారమ్ 10బీడీ) దాఖలు చేయాలి.
జూన్ 2026
జూన్ 7: మే 2026 నెలకు సంబంధించిన టీడీఎస్/టీసీఎస్ డిపాజిట్ చేయాలి.
జూన్ 15: మొదటి విడత అడ్వాన్స్ టాక్స్ (సంవత్సరం మొత్తం పన్ను బాధ్యత అంచనాలో 15శాతం) చెల్లించడానికి చివరి తేదీ.
జూన్ 30: మే నెలకు సంబంధించిన టీడీఎస్ చలాన్–స్టేట్‌మెంట్ దాఖలు చేయాలి. ఏఐఎఫ్‌లు క్రితం త్రైమాసిక నివేదికలను సమరి్పంచాలి.
జూలై 2026
జూలై 31: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు తమ ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్–1 లేదా ఐటీఆర్–2) దాఖలు చేయడానికి చివరి తేదీ.
ఆగస్టు 2026
ఆగస్టు 15: ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ రిటర్నులు దాఖలు చేయాలి.
ఆగస్టు 31: ఆడిట్ అవసరం లేని వ్యాపార నిపుణులు ఐటీఆర్–3 లేదా ఐటీఆర్–4 దాఖలు చేయడానికి పొడిగించిన గడువు.
సెప్టెంబర్ 2026
సెప్టెంబర్ 15: రెండో విడత అడ్వాన్స్ టాక్స్ (మొత్తం 45శాతం) చెల్లించడానికి చివరి తేదీ.
సెపె్టంబర్ 30: జూలై–సెప్టెంబర్ (క్యూ2) త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ రిటర్నులు దాఖలు చేయాలి.
అక్టోబర్ 2026
అక్టోబర్ 31: ఆడిట్ అవసరమైన వ్యాపారస్తులు, నిపుణులు తమ ఐటీఆర్–3/ఐటీఆర్–4 రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.
నవంబర్ 2026
నవంబర్ 30: అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించిన వారు ’ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్’ (ఫారమ్ 3సీఈబీ) సమరి్పంచాలి.
డిసెంబర్ 2026
డిసెంబర్ 15: మూడో విడత అడ్వాన్స్ టాక్స్ (మొత్తం 75శాతం) చెల్లించడానికి చివరి తేదీ.
డిసెంబర్ 31: ఆలస్యంగా దాఖలు చేసే రిటర్నులకు పెనాలీ్టతో దాఖలు చేయడానికి చివరి అవకాశం.
జనవరి 2027
జనవరి 31: ఉద్యోగులు తమ పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడుల వివరాలను యజమాన్యానికి సమర్పించాలి.
ఫిబ్రవరి 2027
ఫిబ్రవరి 15: జనవరి నెలకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్‌ఐ జమ చేసేందుకు గడువు.
మార్చి 2027
మార్చి 15: చివరి విడత అడ్వాన్స్ టాక్స్ (100 శాతం) చెల్లించడానికి గడువు.
మార్చి 31: పన్ను ఆదా కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు, సవరణ రిటర్నలు, ఆలస్యపు రిటర్నుల దాఖలుకు చివరి తేదీ.


