ఇక ఫింగర్‌ప్రింట్‌తోనే పేమెంట్స్! | BHIM App Approve UPI Payments up to Rs 5000 using Biometrics | Sakshi
Sakshi News home page

ఇక ఫింగర్‌ప్రింట్‌తోనే పేమెంట్స్!

Mar 25 2026 6:25 PM | Updated on Mar 25 2026 6:59 PM

BHIM App Approve UPI Payments up to Rs 5000 using Biometrics

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన అనుబంధ సంస్థ ‘ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్’ (NBSL) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై భీమ్ యాప్ ద్వారా చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు పిన్ అవసరం లేకుండా, కేవలం వేలిముద్ర లేదా ఫేస్‌ రికగ్నిషన్‌తో నగదు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఫీచర్‌ ముఖ్యాంశాలు

రూ. 5,000 వరకు పరిమితి: వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని బయోమెట్రిక్ ఫీచర్‌ను ఉపయోగించి గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.

పిన్ ఎంట్రీతో పనిలేదు: తరచూ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుంది.

అధిక భద్రత: పిన్ షేరింగ్ వంటి రిస్క్‌లను తగ్గించి, వ్యక్తిగత గుర్తింపు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇది మరింత సురక్షితం.

రూ. 5,000 దాటితే: అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు భద్రతా కారణాల దృష్ట్యా యధావిధిగా యూపీఐ పిన్ తప్పనిసరి.

యాక్టివేట్ చేసుకునే విధానం
భీమ్ యాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ను యాక్టివేట్‌ కోవడానికి ఈ కింది దశలను అనుసరించండి..

  • భీమ్ (BHIM) యాప్ ఓపెన్ చేయండి.

  • ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లండి.

  • మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.

  • యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేయండి.

ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫారమ్‌లలో బయోమెట్రిక్ సదుపాయం ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement