బయోమెట్రిక్‌తో యూపీఐ, కార్డు చెల్లింపులు | ICICI Axis Bank Launch Biometric Authentication for UPI Card Payments | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్‌తో యూపీఐ, కార్డు చెల్లింపులు

May 3 2026 7:59 AM | Updated on May 3 2026 8:01 AM

ICICI Axis Bank Launch Biometric Authentication for UPI Card Payments

ముంబై: ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ ఐమొబైల్‌ యాప్‌లో యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం బయోమెట్రిక్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఫేషియల్‌ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్‌ ధృవీకరణ ద్వారా రూ. 5,000 వరకు లావాదేవీలను చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా యూపీఐ పిన్‌ నంబరును ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.

మరోవైపు, యాక్సిస్‌ బ్యాంక్, ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాం పేయూతో కలిసి కార్డు చెల్లింపులకు బయోమెట్రిక్‌ ధృవీకరణను అందుబాటులోకి తెచ్చినట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. దీనితో ఇకపైయాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌హోల్డర్లు ఫేస్‌ ఐడీ లేదా వేలిముద్ర ద్వారా చెల్లింపులను ఆమోదించవచ్చని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement