డిజిటల్‌ గోల్డ్‌కు అక్షయ తృతీయ మెరుపులు | Akshaya Tritiya 2026 Digital Gold Emerges as a Preferred Choice for Investors | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ గోల్డ్‌కు అక్షయ తృతీయ మెరుపులు

Apr 19 2026 1:01 PM | Updated on Apr 19 2026 1:25 PM

Akshaya Tritiya 2026 Digital Gold Emerges as a Preferred Choice for Investors

న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి ఆభరణాలు, నాణేలతో పాటు డిజిటల్‌ రూపంలో కూడా బంగారం కొనుగోళ్లపై కూడా గణనీయంగా ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డిజిటల్‌ గోల్డ్‌ని మరింత సులభతరంగా, పారదర్శకంగా కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమోడిటీస్‌ విభాగం రీసెర్చ్‌ హెడ్‌ నవనీత్‌ దమానీ, అనలిస్ట్‌ మానవ్‌ మోదీ ఒక నివేదికలో తెలిపారు.

పసిడి ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్‌ వృద్ధి మందగించడం, మానిటరీ పాలసీ అంచనాల్లో మార్పులు తదితర అంశాల కారణంగా 2026లో బులియన్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనవుతోందని తెలిపారు. మధ్య మధ్యలో కరెక్షన్‌కి లోనైనప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్‌ నెలకొనడంతో పసిడి, వెండి వరుసగా 10, 5 శాతం మేర పెరిగాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement