EPF వడ్డీ రేటు పెంపు? ప్రభుత్వ ప్రకటన ఇదీ.. | Will EPF interest rate be increased to 10pc Government clarifies | Sakshi
Sakshi News home page

EPF వడ్డీ రేటు పెంపు? ప్రభుత్వ ప్రకటన ఇదీ..

Apr 3 2026 3:03 PM | Updated on Apr 3 2026 3:33 PM

Will EPF interest rate be increased to 10pc Government clarifies

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వడ్డీ రేటును 10 శాతానికి పెంచుతారనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ వైఖరిని వివరించారు.

కార్మిక సంఘాల నుంచి డిమాండ్ లేదు
ఈపీఎఫ్ వడ్డీ రేటును 10 శాతానికి పెంచాలని కార్మిక సంఘాలు ఏవైనా డిమాండ్ చేశాయా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. అటువంటి విజ్ఞప్తులేవీ ప్రభుత్వం వద్దకు రాలేదని స్పష్టం చేశారు. వడ్డీ రేటు పెంపుపై యూనియన్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రతిపాదనలు లేవని ఆమె పేర్కొన్నారు.

10 శాతం రేటు సాధ్యమేనా?
వడ్డీ రేటును 10 శాతానికి పెంచే అంశంపై ఈపీఎఫ్ఓ (EPFO) ఏదైనా ఆర్థిక లేదా యాక్చురియల్ విశ్లేషణ నిర్వహించిందా అన్న అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును నిర్ణయించే అధికారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT)కు ఉంటుందని, వారి సిఫార్సుల మేరకే నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు.

వడ్డీ రేటును ఎలా నిర్ణయిస్తారంటే..
ఈపీఎఫ్ వడ్డీ రేట్ల లెక్కింపు వెనుక ఉన్న ప్రాతిపదికను ప్రభుత్వం ఈ సందర్భంగా వివరించింది. ఈపీఎఫ్ నిధిని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టగా వచ్చే వాస్తవ ఆదాయం ఆధారంగానే వడ్డీ రేటును నిర్ణయిస్తారు.ఇది కేవలం పెట్టుబడి రాబడిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇతర ఆర్థిక వేరియబుల్స్‌తో దీనిని పోల్చడం సాధ్యం కాదు. ఈపీఎఫ్ పథకం-1952లోని పారాగ్రాఫ్ 60(4) ప్రకారం.. వడ్డీ ఖాతాలో నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement