యాక్సిస్‌ బ్యాంక్‌: మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ కొత్తగా.. | Axis Bank Introduces Aadhaar Based Face Authentication for Mobile Number Updates | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంక్‌: మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ కొత్తగా..

Apr 3 2026 5:57 PM | Updated on Apr 3 2026 6:13 PM

Axis Bank Introduces Aadhaar Based Face Authentication for Mobile Number Updates

ముంబై: బ్యాంకు ఖాతాకి అనుసంధానమైన మొబైల్‌ నంబరును మార్చుకోవడానికి సంబంధించి ఆధార్‌ ఆధారిత ఫేస్‌ ఆథెంటికేషన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇందుకోసం ముందుగా కొత్త నంబరును ఎంటర్‌ చేసి, ఆధార్‌ఫేస్‌ఆర్‌డీ యాప్‌ ద్వారా ఫోన్‌ ఫ్రంట్‌ కెమెరాతో లైవ్‌ ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత కొత్త మొబైల్‌ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. యాక్సిస్‌ మొబైల్‌ యాప్‌ ‘యాప్‌’లో రీ–రిజిస్టర్‌ చేసుకున్నాక, భద్రతా కారణాల రీత్యా తొలి 24 గంటల పాటు మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల పరిమితులు, డిఫాల్ట్‌ స్థాయికి సెట్‌ అవుతాయి.  

ఈ నూతన సదుపాయం వల్ల ఖాతాదారులు మొబైల్ నంబర్ మార్పు కోసం బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు లేదా బ్యాంకుకు వెళ్లలేని వృద్ధులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. అయితే, ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే ఖాతాదారుడి ఆధార్ డేటాబేస్‌లో ఫోటో, ఇతర వివరాలు లేటెస్ట్‌ ఉండటం తప్పనిసరి.

సాంకేతిక భద్రతతో కూడిన ఈ ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని, కేవలం ముఖ గుర్తింపు ద్వారానే కాకుండా ఓటీపీ ధ్రువీకరణ కూడా ఉండటం వల్ల ఖాతాదారుల డేటాకు పూర్తి రక్షణ లభిస్తుందని బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement