breaking news
Face Authentication
-
ఉమాంగ్ యాప్‌లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్
ఉమాంగ్ యాప్‌లో (UMANG App) యూఏఎన్ (UAN) యాక్టివేషన్‌కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO ఈపీఎఫ్ఓ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూఏఎన్ పొందడానికి, యాక్టివేట్ చేసుకునేందుకు ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్ఏటీ)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త ప్రక్రియ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది.యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు, వివరాలను అప్డేట్ చేసేందుకు, ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకునేందుకు, ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) వంటి పథకాల కింద ప్రయోజనాలు పొందడానికి యూఏఎన్ అవసరం. యూఏఎన్ యాక్టివేట్ చేయకుండా సభ్యులు ఈ ఆన్లైన్ సేవలను పొందలేరు.ఉమాంగ్ యాప్ గురించి..యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ (ఉమాంగ్) అనేది ఒక ప్రభుత్వ యాప్. ఇది ఒకే ప్లాట్‌ఫామ్‌పై అనేక ఈ-గవర్నెన్స్ సేవలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా పౌరులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వారి యూఏఎన్‌ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ రికార్డులను అప్డేట్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే తమ స్మార్ట్ఫోన్ల నుండి నేరుగా వారి ఈ-యూఏఎన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మికులు, నేపాల్, భూటాన్ పౌరులకు తప్ప మిగతా ఉద్యోగులందరికీ ఆగస్టు 1 నుంచి ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ జనరేషన్ లేదా యాక్టివేషన్‌కు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్‌ను ఈపీఎఫ్‌వో తప్పనిసరి చేసింది. -
పోస్టల్ బ్యాంకుల్లో ఇక ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల్లో ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయం ప్రారంభమైంది. సామాన్య ప్రజలకు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు బ్యాంకింగ్‌ను మరింత సురక్షితంగా, సమ్మిళితంగా, సౌకర్యవంతంగా చేయడానికి ఈ ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చారు.యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫ్రేమ్‌వర్క్ కింద అభివృద్ధి చేసిన ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఖాతాదారులు ముఖ గుర్తింపును ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇకపై వేలిముద్రలు లేదా ఓటీపీల వంటి భౌతిక బయోమెట్రిక్ ఇన్పుట్ల అవసరం ఉండదు."ఐపీపీబీలో, బ్యాంకింగ్ అందుబాటులో ఉండటమే కాదు.. హుందాగా ఉండాలని మేము నమ్ముతున్నాం. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా బయోమెట్రిక్ వేలిముద్రలు లేదా ఓటీపీ ధృవీకరణలో పరిమితుల కారణంగా ఏ కస్టమర్ కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. ఇది కేవలం టెక్ ఫీచర్ మాత్రమే కాదు. ఇది ఆర్థిక సమ్మిళితాన్ని పునర్నిర్వచించే దిశగా ఒక అడుగు" అని ఐపీపీబీ ఎండీ, సీఈవో ఆర్ విశ్వేశ్వరన్ పేర్కొన్నారు.ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్ కీలక ప్రయోజనాలుఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ సెన్సార్లపై ఆధారపడకుండా ఆధార్ ఆథెంటికేషన్ సురక్షితంసులువైన కస్టమర్ అనుభవం కోసం వేగవంతమైన, కాంటాక్ట్ లెస్ లావాదేవీలుఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన బ్యాంకింగ్ఖాతా తెరవడం, బ్యాలెన్స్ విచారణ, ఫండ్ ట్రాన్స్ఫర్లు, యుటిలిటీ చెల్లింపులతో సహా అన్ని బ్యాంకింగ్ సేవలకు మద్దతు. -
‘ఫేషియల్ అథంటికేషన్’కు అనుమతి .. తొలి రాష్ట్రం ఏపీనే
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, ఉద్యోగుల హాజరు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆధార్ అనుసంధానంతో కూడిన ‘ఫేషియల్ అథెంటికేషన్’ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దేశంలో ఇలా ఆమోదం పొందిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మాత్రమే ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్) ద్వారా నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగిస్తున్నారు. నిజానికి.. మన రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో, ప్రభుత్వోద్యోగుల హాజరులో ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని మాత్రమే అమలుచేస్తున్నారు. అయితే.. ఈ విధానంలో లబ్దిదారుల వేలిముద్రలు సేకరించడానికి, ఉద్యోగుల హాజరు నమోదుకు మొబైల్ ఫోన్లు, యాప్‌లకు తోడు ప్రత్యేక వేలిముద్రల నమోదు యంత్రాలను ఉపయోగిస్తారు. సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. ఇవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటోంది. ఇందుకు ఏటా రూ.10–12 కోట్లు వెచి్చంచాల్సి వస్తోంది. మరోవైపు.. వేలిముద్ర సరిపోక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫేíషియల్ అథంటికేషన్ విధానంలో అయితే అదనంగా ఎలాంటి పరికరాలు అక్కర్లేదని అధికారులు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేయగానే అది ఆధార్‌కు అనుసంధానమై లబి్ధదారుణ్ణి గుర్తిస్తుందని అధికారులు తెలిపారు. 80 వేల మందికి పింఛన్ల పంపిణీకి రూ.కోటి ఖర్చు.. ఇక ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో ప్రతినెలా పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసుకునే వాళ్ల వేలిముద్రలు అరిగిపోవడంతో బయోమెట్రిక్ సమయంలో ఇచ్చే వేలిముద్రలకు ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బయోమెట్రిక్ స్థానంలో ఐరిస్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితోనూ సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతినెలా 80 వేల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతోంది. ఇలాంటి వారి ఫొటోలను స్థానిక సిబ్బందే ముందుగా యాప్‌లో నమోదుచేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబి్ధదారుని ఫొటో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. నిజానికి.. ఒక లబి్ధదారునికి ఒక విడత పంపిణీ చేస్తే రూ.10 చొప్పున సాఫ్ట్వేర్ ప్రొవైడర్‌కు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పుడు పింఛన్ల పంపిణీలో ఆధార్ ఫేషియల్ విధానాన్ని ప్రవేశపెడితే మధ్యలో స్టాఫ్ట్వేర్ ప్రొవైడర్‌కు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆధార్ బేస్డ్ ‘ఫేషియల్ అథంటికేషన్’లో కొద్దిపాటి అవినీతికీ ఆస్కారముండదని అధికార వర్గాలు వివరించాయి. ప్రయోగాత్మకంగా అమలుచేశాకే పూర్తిస్థాయిలో.. ఈ రెండు విధానాలు అధార్ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్ విధానంలో తలెత్తే ఇబ్బందులన్నింటినీ ఫేషియల్ అథంటికేషన్ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు యూఐడీఏఐ విభాగం అనుమతి తప్పనిసరి. దీంతో రాష్ట్రంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలుకు కేంద్ర ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ అనుమతిని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోరింది. ఆయా సంస్థల సూచనల మేరకు పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో అమలుచేశారు. ఆ తర్వాతే ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగానికి ఆమోదం లభించింది. సచివాలయ ఉద్యోగులకు ‘ఫేషియల్’ ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా శుక్రవారం నుంచి ఆధార్ అనుసంధానంతో కూడిన ఫేషియల్ (ముఖం గుర్తింపు) ద్వారా కూడా హాజరు నమోదుచేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొబైల్ యాప్‌లో శుక్రవారం కొత్తగా ఈ సౌకర్యాన్ని కలి్పంచారు. ఇక నుంచి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంతోపాటు ఐరిస్ (కళ్లు గుర్తింపు) విధానం, కొత్తగా ఫేషియల్ విధానంలోనూ హాజరు నమోదుకు వీలు కల్పించారు. ఈ మూడింట్లో దేని ద్వారానైనా హాజరు నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.