ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా? | Bank holidays this week SBI, HDFC and others closed on these days | Sakshi
Sakshi News home page

ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా?

Apr 6 2026 11:09 AM | Updated on Apr 6 2026 11:25 AM

Bank holidays this week SBI, HDFC and others closed on these days

సామాన్యుడి దైనందిన జీవితంలో బ్యాంకింగ్ సేవలు అంతర్భాగమయ్యాయి. నగదు విత్‌డ్రాయల్స్ నుంచి లోన్ అప్లికేషన్ల వరకు ఏదో ఒక పనిపై మనం బ్యాంకులను సందర్శిస్తుంటాం. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 మధ్య బ్యాంకుల పనిదినాల వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ వారం ప్రత్యేక సెలవులు లేవు
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఈ వారంలో (ఏప్రిల్ 6 - ఏప్రిల్ 12) దేశవ్యాప్తంగా ఎలాంటి జాతీయ లేదా ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లోనే సేవలందిస్తాయి. అయితే, వారాంతపు సెలవుల కారణంగా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. సాధారణంగా బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.

ఆన్‌లైన్ సేవలు అందుబాటులో..
బ్యాంకులకు భౌతికంగా సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవలతోపాటు నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ (NEFT, RTGS, IMPS) చేసుకోవచ్చు. ఇక ఏటీఎం (ATM) కేంద్రాలు 24 గంటలూ తెరిచి ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement