ఫండ్స్‌లో పెట్టుబడులకు గిఫ్ట్‌ కార్డులు | SEBI Proposes Gift Cards for Mutual Fund Investments to Boost Retail Participation | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌లో పెట్టుబడులకు గిఫ్ట్‌ కార్డులు

Mar 26 2026 7:36 AM | Updated on Mar 26 2026 11:20 AM

SEBI Proposes Gift Cards for Mutual Fund Investments to Boost Retail Participation

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల దిశగా మరింత మంది ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు సెబీ.. గిఫ్ట్‌ కార్డులు లేదా గిఫ్ట్‌ ప్రీ పెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్లను (పీపీఐలు) ప్రతిపాదించింది. దీని ప్రకారం ఎవరైనా సరే గిఫ్టీపీపీఐలను కొనుగోలు చేసి వేరొకరికి కానుకగా ఇవ్వొచ్చు. ఈ గిఫ్ట్‌ పీపీఐలను స్వీకరించిన వారు వాటితో తమకు నచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు.

ఈ ప్రతిపాదనపై సలహాలు, సూచనలను ఏప్రిల్‌ 14లోపు తెలియజేయాలని సెబీ కోరింది. గిఫ్ట్‌ పీపీఐలను ఎల్రక్టానిక్‌ బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఏడాదిగా ఉంటుంది. గిఫ్ట్‌ పీపీఐ ద్వారా ఒక్కో ఇన్వెస్టర్‌ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని సెబీ పరిమితి పెట్టింది.

గిఫ్ట్‌ పీపీఐలను అనుమతించాలంటూ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ చేసిన వినతి మేరకు సెబీ ఈ చర్యకు ఉపక్రమించింది. రిటైల్‌ కొనుగోళ్లకు సంబంధించి గిఫ్ట్‌ కార్డులు ఎంతో ప్రాచుర్యం పొందడం తెలిసిందే. ఇప్పుడు వీటిని పెట్టుబడుల వైపు మళ్లించేందుకు సెబీ నిర్ణయం తోడ్పడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement