● కార్యకర్తకు షోకాజ్‌ నోటీస్‌ ● విచారణ చేపట్టిన మానవహక్కుల సంఘం | - | Sakshi
Sakshi News home page

● కార్యకర్తకు షోకాజ్‌ నోటీస్‌ ● విచారణ చేపట్టిన మానవహక్కుల సంఘం

Feb 14 2026 10:05 AM | Updated on Feb 14 2026 10:05 AM

● కార్యకర్తకు షోకాజ్‌ నోటీస్‌ ● విచారణ చేపట్టిన మానవహక్

● కార్యకర్తకు షోకాజ్‌ నోటీస్‌ ● విచారణ చేపట్టిన మానవహక్

● కార్యకర్తకు షోకాజ్‌ నోటీస్‌ ● విచారణ చేపట్టిన మానవహక్కుల సంఘం

అంగన్‌వాడీ కేంద్రం సీజ్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని అంగన్‌వాడీ టీచర్‌ మూడేళ్ల బాలుడిని చితకబాదిన ఘటనపై శుక్రవారం అంగన్‌వాడీ ఉన్నతాధికారులు, రాష్ట్ర మానవహక్కుల సంఘం విచారణ చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్‌ అధికారులు సీజ్‌ చేశారు. వెంకటాపూర్‌కు చెందిన కొంపెల్లి లక్ష్మి–విజయ్‌ దంపతుల కుమారుడు విద్వాన్ష్‌ అల్లరి చేస్తున్నాడని టీచర్‌ కొట్టింది. బాలుడు తీవ్రంగా గాయపడడంతో తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించారు. మానవహక్కుల సంఘం స్పందించి వెంటనే వివరణ ఇవ్వాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఐసీడీఎస్‌ సీడీపీవో ఉమారాణి, టీచర్‌ సల్వాని రాణికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మానవహక్కుల కమిషన్‌ స్వయంగా విచారణ ప్రారంభించింది. బాలుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వైద్య నివేదిక ఆధారంగా అంగన్‌వాడీ టీచర్‌పై తీసుకున్న క్రిమినల్‌, శాఖాపరమైన చర్యలపై విచారించారు. పోలీస్‌ దర్యాప్తు, ఎఫ్‌ఐఆర్‌, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల భద్రతకు తీసుకున్న చర్యలపై మార్చి 9లోపు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను కమిషనర్‌ ఆదేశించినట్లు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మెంబర్‌ సరిత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement