నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Feb 16 2026 7:17 AM | Updated on Feb 16 2026 7:17 AM

నేటి

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు ‘ప్రైవేట్‌ వ్యక్తులను ఎలా అనుమతిస్తారు’ పవర్‌లిఫ్టింగ్‌లో రాష్ట్ర బహుమతి ఘనంగా సేవాలాల్‌ జయంతి

సిరిసిల్లటౌన్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదివారం ప్రకటించారు. వేములవాడ మహాశివరాత్రి జాతర, మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొటోకాల్‌ ఉన్న వారెవ్వరూ రాజన్నను దర్శించుకునే అవకాశాలు లేనప్పు డు ఓ ప్రైవేట్‌ వ్యక్తి ఎలా దర్శించుకుంటారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రశ్నించారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల్లో హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ భీమన్న ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించి, ఇక్కడే దర్శనం చేసుకుని వెళ్లారన్నారు. అయితే సదరు వ్యక్తి ఎలా రాజన్న గుడిలో పూజలు చేస్తారని ప్రశ్నించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించి బాధ్యలపై చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించారు.

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్లకు చెందిన పవర్‌ లిఫ్టర్‌ నేహా రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సీనియర్స్‌ విభాగంలో పాల్గొన్నారు. స్వాట్స్‌–110 కేజీ, బెంచ్‌ 47.50 కేజీ, డెడ్‌లిఫ్ట్‌ 132.50కేజీలు లిఫ్ట్‌ చేసి బహుమతులు సాధించారు.

వీర్నపల్లి(సిరిసిల్ల): ఆధ్యాత్మికవేత్త, గిరిజన ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ ముక్తార్‌పాషా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. సేవాలాల్‌ మహారాజ్‌ చిత్రపటాన్ని, విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు.

నేటి ప్రజావాణి రద్దు
1
1/2

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు
2
2/2

నేటి ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement