అంతా లాంఛనమే.. | - | Sakshi
Sakshi News home page

అంతా లాంఛనమే..

Feb 16 2026 7:17 AM | Updated on Feb 16 2026 7:17 AM

అంతా లాంఛనమే..

అంతా లాంఛనమే..

నేడు కొలువుదీరనున్న కౌన్సిల్‌

సిరిసిల్లలో కేటీఆర్‌దే నిర్ణయం

వేములవాడలో ఆది శ్రీనివాస్‌ చెప్పిన వారికే పీఠం

సిరిసిల్లటౌన్‌/వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు నిర్ణయం మేరకు చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక పూర్తికానుంది. వేములవాడలో 28 వార్డులకు 13 స్థానాలు కాంగ్రెస్‌ గెలుచుకోగా.. ఇద్దరు స్వతంత్రులు, ఒకరు బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో హస్తం బలం 16కు చేరింది. వేములవాడ మున్సిపల్‌ పీఠంపై తొలిసారి కాంగ్రెస్‌ జెండా ఎగురనుంది. ఇక్కడ విప్‌ ఆది శ్రీనివాస్‌ నిర్ణయం మేరకు చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక పూర్తికానుంది. ఇప్పటికే శిబిరంలో ఉన్న రెండు మున్సిపాలిటీల కౌన్సిలర్లు సోమవా రం సిరిసిల్ల, వేములవాడలకు చేరుకుంటున్నారు. మున్సిపల్‌ ఆఫీస్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం 12.30 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశంలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నికోనున్నారు.

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి రెండు మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. నిబంధనల మేరకు సీట్ల కేటాయింపులు, ప్రమాణ స్వీకారం చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను కోరం ఆధారంగా నిర్వహిస్తారు. చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ పదవులు ఎవరిని వరిస్తాయా అన్న అంశం సస్పెన్స్‌గా మిగిలింది.

క్యాంపుఫైర్‌తో జోష్‌

వేమువాడ మున్సిపల్‌ పీఠంపై కూర్చునేది ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలనుంది. మున్సిపల్‌ ఆఫీ స్‌లో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారో త్సవం ఉంటుందని కమిషనర్‌ సంపత్‌కుమార్‌ తెలి పారు. ఆర్డీవో రాధాభాయి నేతృత్వంలో ముందుగా ప్రమాణ స్వీకారం, అనంతరం చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.

అత్యధిక మెజార్టీకే చైర్మన్‌ గిరి.. హ్యాట్రిక్‌ విజేతకు వైస్‌చైర్మన్‌ !

మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలు పొందిన 15వ వార్డు కౌన్సిలర్‌ పుల్కం రాజు(875 ఓట్లు)కు చైర్మన్‌ గిరి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. హ్యాట్రిక్‌ విక్టరీ సాధించిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ నరాల శేఖర్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు వైస్‌చైర్మన్‌ పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ క్యాంప్‌ఫైర్‌

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే కాంగ్రెస్‌ కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. క్యాంప్‌ ఫైర్‌తో సరదాగా గడుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement