హంగ్ ఆర్భాటాలు
పొత్తుల దిశగా కత్తులు దూసుకున్న ప్రత్యర్థులు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ మిలాఖత్ అయినప్పటికీ పీఠంపై కూర్చుంటామంటున్న బీజేపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ఎంసీకే పంచాయితీ రాయికల్, మెట్‌పల్లిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దోస్తీ జమ్మికుంటలో బీఆర్‌ఎస్‌కు పీఠం దక్కకుండా కాంగ్రెస్ ఎత్తుగడ
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు రాయికల్, మెట్‌పల్లి, జమ్మికుంటలో పరిస్థితి భిన్నంగా మారింది. ఎన్నికల ఫలితాల వరకు మాటల కత్తులు దూసుకున్న పార్టీలు మేయర్, మున్సిపల్ చైర్మన్ కోసం పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. ముఖ్యంగా 66 డివిజన్‌లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్‌లో 30 సీట్లు బీజేపీ గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్‌బీ 2 చొప్పున గెలుచుకున్నారు. ఇండిపెండెంట్లలో నలుగురు చేరడంతో బీజేపీ బలం 34కు చేరింది. వీరికి స్థానిక ఎంపీ బండి సంజయ్ ఎక్స్‌అఫీషియో ఓటు తోడవడంతో బలం 35కు పెరిగింది. ఈ క్రమంలోనే మేయర్ పీఠం కాంగ్రెస్‌కు రావాలని అధికార పార్టీ వ్యూహాలు రచించింది. బీఆర్‌ఎస్, మజ్లిస్‌తో కలిసి అవగాహనకు వచ్చింది. కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 9, స్వతంత్రులు 5, ఎంఐఎం 3, ఏఐఎఫ్‌బీ 2, ఎక్స్‌అఫీషియో ఇద్దరితోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు (గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ) ఓటుతో సంఖ్యాబలం 35 ఉందంటున్నారు. ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి విషయంలో రెండు కూటములు తమ వైపే ఉన్నారని వాదిస్తున్నారు. ఈ పంచాయితీ ప్రస్తుతం సీఎం కార్యాలయానికి చేరడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రులు వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. మేయర్ పీఠం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది.
హంగ్ ఆర్భాటాలు


