వివాదాల వర్సిటీ..! | - | Sakshi
Sakshi News home page

వివాదాల వర్సిటీ..!

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

వివాదాల వర్సిటీ..! వర్సిటీ గాథలు–1 ● వీసీ వర్సెస్‌ ప్రొఫెసర్‌ ● శాతవాహన వీసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిషన్‌కు ఫిర్యాదు ● దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపణలు ● మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ చెప్పినా మారని వాతావరణం ● ప్రశ్నిస్తే అర్బన్‌ నక్సల్స్‌ అంటున్నారని విద్యార్థుల ఆవేదన ● జిల్లాలో అర్బన్‌ నక్సల్స్‌ ఊసే లేదన్న సీపీ ఆలం ● రెండు వర్గాలుగా చీలిన వర్సిటీ సిబ్బంది

వర్సిటీ గాథలు–1

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

శాతవాహన యూనివర్సిటీ వివా దాలకు నిలయంగా మారుతోంది. క్రమశిక్షణ పేరిట కొంతకాలంగా వీసీ ఉమేశ్‌కుమార్‌ తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులు నిరసన బాట పట్టగా.. తాజాగా దళితులే లక్ష్యంగా వేధిస్తున్నారంటూ ఏకంగా ప్రొఫెసర్లు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. దళిత మ హిళనైన తనను కొంతకాలంగా తన అసంబద్ధ చర్యలతో వేధిస్తున్నారంటూ తెలంగాణ విద్యాకమిషన్‌ సలహా కమిటీ సభ్యురాలు, సోషియాలజీ విభాగాధిప తి సూరేపల్లి సుజాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ క మిషన్‌కి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అకారణంగా తనను, మ రికొందరు దళిత విద్యార్థులను అర్బన్‌ నక్సలైట్లు అంటూ ప్రచారం చేయడం తన మనోభావాలను దెబ్బతీసిందని ఫి ర్యాదులో పేర్కొన్నారు. ఓవైపు తెలంగా ణలో మావోయిస్టులు లేరంటూ డీజీపీ ప్రకటిస్తుంటే.. తమను అర్బన్‌ నక్సలైట్లంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తున్న వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement