● మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ● గుడి చెరువు పనులు పరిశీలన
వేములవాడ: పట్టణ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. గుడిచెరువు అభివృద్ధి పనులు, చెరువులోకి మురికినీరు చేరకుండా మూలవాగు వరకు చేపట్టిన అండర్‌గ్రౌండ్ పైపులైన్ పనులను శుక్రవారం పరిశీలించారు. చైర్మన్ రాజు మాట్లాడుతూ గుడి చెరువు కలుషితం కాకుండా చూడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు. వైస్‌చైర్మన్ నరాల శేఖర్, 17వ వార్డు కౌన్సిలర్ ముత్యం, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


