● జిల్లా అటవీ అధికారి బాలమణి
వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు, అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ అధికారి బాలమణి కోరారు. వీర్నపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం పరిశీలించారు. డీఎఫ్‌వో బాలమణి మాట్లాడుతూ అటవీ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించాలన్నారు. జంతువుల పాదముద్రలు, విసర్జనలు, సంచార ఆనవాళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు. ప్రమాద సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి, సెక్షన్ అధికారులు రంజిత్‌కుమార్, సకారం, పద్మలత, బీట్ అధికారులు కిరణ్, రజిత, సతీశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
కోడెల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
వేములవాడఅర్బన్: భీమేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ఓ కోడె నీరసంగా ఉన్నట్లు గమనించిన ఈవో రమాదేవి వెంటనే స్పందించారు. గోశాలకు తరలించి వైద్యం అందేలా చూశారు. ఈవో మాట్లాడుతూ భక్తులు తెచ్చే కోడెల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు.


