చైర్మన్ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు
సిరిసిల్లటౌన్/వేములవాడ: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు చేస్తున్న ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్, అధికారులు శ్రీనివాసాచారి, అన్సార్ తదితరులు పాల్గొన్నారు.


