ఓటేద్దాం | - | Sakshi
Sakshi News home page

ఓటేద్దాం

Feb 11 2026 8:45 AM | Updated on Feb 11 2026 8:45 AM

ఓటేద్

ఓటేద్దాం

● సిరిసిల్ల, వేములవాడలో మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ● పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సిబ్బంది .. 175 కేంద్రాలు ● ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,22,836 మంది ఓటర్లు

పార్టీల వారీగా అభ్యర్థులు

జిల్లాలో..

● సిరిసిల్ల, వేములవాడలో మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ● పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సిబ్బంది .. 175 కేంద్రాలు ● ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,22,836 మంది ఓటర్లు
నేడు పుర పోరు

సిరిసిల్లలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఎన్నికల సిబ్బంది

సిరిసిల్ల/వేములవాడ: జిల్లాలో మున్సి పల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సిరిసిల్లలోని గీతానగర్‌ హైస్కూల్‌, వేములవాడలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు నియమితులైన 957 మంది అధికారులు బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పత్రాలతో మంగళవారం సాయంత్రమే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో 1,22,836 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఇప్పటికే పోల్‌చిట్టీలు పంపిణీ చేశారు. సిరిసిల్లలో 39 వార్డులు ఉండగా.. 170 మంది, వేములవాడలో 28 వార్డులకు 113 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

వార్డులకు రెండు.. మూడు..

సిరిసిల్లలో ఒక్కో వార్డుకు మూడు.. వేములవాడలో ఒక్కో వార్డుకు రెండు పోలింగ్‌ స్టేషన్ల చొప్పున ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాల్లో పోలింగ్‌ స్టేషన్లు దూరంగా ఉండడంతో వేములవాడలో మరో రెండు కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది మంగళవారమే రిసెప్షన్‌ సెంటర్లకు చేరుకోగా.. పోలింగ్‌ సామగ్రిని అందించారు. బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. సామగ్రిని సరిచూసుకుని ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు.

విలీన గ్రామాల్లో ఎన్నికల సందడి

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో విలీనమైన 12 గ్రామాల్లో రెండో సారి మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. సిరిసిల్లలో విలీనమైన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్ధాపూర్‌, వేములవాడలో విలీనమైన మారుపాక, తిప్పాపూర్‌, శాత్రాజ్‌పల్లి, కోనాయపల్లి, అయ్యోరుపల్లెలు గతంలో గ్రామాలుగా ఉండేవి. గత మున్సిపల్‌ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో విలీనం కావడంతో వార్డుల వారీగా పురపోరు సందడి నెలకొంది.

కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇప్పటికే 163 బీఎన్‌ఎస్‌ (144 సెక్షన్‌)ను విధించి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో 48 సెన్సిటివ్‌, 17 క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు మున్సిపాలిటీల్లోని 175 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బి గితే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాదాబాయి, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు.

పట్టణం సిరిసిల్ల వేములవాడ

బీఆర్‌ఎస్‌ 39 28

కాంగ్రెస్‌ 39 28

సీపీఐ/ సీపీఎం 03 03

ఇతరులు 14 07

ఇండిపెండెంట్‌ 36 19

మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు పోలింగ్‌కేంద్రాలు సిబ్బంది

సిరిసిల్ల 39 81,959 117 576

వేములవాడ 28 40,877 58 381

ఓటేద్దాం1
1/7

ఓటేద్దాం

ఓటేద్దాం2
2/7

ఓటేద్దాం

ఓటేద్దాం3
3/7

ఓటేద్దాం

ఓటేద్దాం4
4/7

ఓటేద్దాం

ఓటేద్దాం5
5/7

ఓటేద్దాం

ఓటేద్దాం6
6/7

ఓటేద్దాం

ఓటేద్దాం7
7/7

ఓటేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement