ఆర్థిక అవగాహన పెంపొందించాలి
‘మహా’జాతరలో పారిశుధ్యం మెరుగ్గా ఉండాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత పోస్టర్లను కలెక్టర్ సోమవారం జిల్లా సంప్రదింపుల కమిటీ(డీసీసీ) సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహనను కల్పించేందుకు ఆర్బీఐ ఈనెల 9 నుంచి 13 వరకు వారోత్సవం నిర్వహిస్తుందని తెలిపారు. ఆర్‌బీఐ, బ్యాంకులు ఎప్పుడూ మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపదన్నారు. ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడిగే కాల్స్ చేయదని స్పష్టం చేశారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ ఎన్.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్
మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మూడో విడత ర్యాండమైజెషన్‌ను ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పూర్తి చేశారు. డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, నోడల్ అధికారి భారతి, ఈడీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూమ్‌లు పూర్తి చేయాలి
నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేములవాడ, కొండాపూర్, మద్దికుంట, బద్దెనపల్లి, తంగళ్లపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో ఆరా తీశారు. హౌసింగ్ డీఈఈ సాజిద్, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, డీఈఈ శాంతయ్య, జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.
పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే
సిరిసిల్ల, వేములవాడల్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈనెల 11న సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.
వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా పారిశుధ్యం పనులు మెరుగ్గా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వేములవాడ మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈనెల 14 నుంచి 16 వరకు వేములవాడను 20 జోన్లుగా విభజించి ప్రతీ జోన్‌కు ఒక పంచాయతీ కార్యదర్శిని ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అందరూ ఈనెల 13 నుంచి 17 వరకు వేములవాడలో సేవలు అందించాలని ఆదేశించారు. డీఆర్డీవో మచ్చ గీత, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు.


