తైబజార్ లేని మున్సిపాలిటీ జగిత్యాల
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీకి ప్రత్యేకత ఉంది. ఏ మున్సిపాలిటీలోనైనా తైబజార్ వసూలు చేస్తుంటారు. ఇక్కడ మాత్రం తైబజార్ వసూలు చేయరు. కూరగాయల వ్యాపారులైనా.. తోపుడు బండ్ల వ్యాపారులైనా.. రోడ్లపై చిన్నచిన్న వస్తువులను ఎవరైనా అమ్ముకోవచ్చు. ఇలాంటి వారికి తైబజార్ లేకపోవడం ఎంతో వెలుసుబాటు కలిగిస్తోంది. పైగా వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మున్సిపాలిటీలో అప్పటి పాలకవర్గం రూ.200కే నల్లా కనెక్షన్ అమలు చేశారు. అప్పటినుంచి అదే అమలువుతోంది. ఏ మున్సిపాలిటిలోనైనా నల్లా కనెక్షన్ తీసుకోవాలంటే కొంతమొత్తం వసూలు చేస్తుంటారు. ఇక్కడ కేవలం రూ.200కే కనెక్షన్ ఇస్తున్నారు.
రైతులు, వ్యాపారులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు
కొనసాగుతున్న రూ.200కే నల్లా కనెక్షన్


