ఇల్లంతకుంటకు బస్సు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇల్లంతకుంటకు బస్సు ప్రారంభం

Feb 10 2026 8:08 AM | Updated on Feb 10 2026 8:08 AM

ఇల్లం

ఇల్లంతకుంటకు బస్సు ప్రారంభం

యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కేసు మదర్‌ థెరిసాలో డిప్లొమా విద్యార్థులకు వర్క్‌షాప్‌

ఇల్లంతకుంట(మానకొండూర్‌): వెంకట్రావుపల్లి మీదుగా ఇల్లంతకుంటకు సిద్దిపేట బస్సు సోమవారం ప్రారంభంకాగా వెంకట్రావుపల్లి, ఇల్లంతకుంట, గ్రామాల సర్పంచులు చల్ల నవీన్‌ రెడ్డి, మామిడి రాజు ప్రారంభించారు. మండల ప్రజలు కాంగ్రెస్‌ నాయకులు, ఇల్లంతకుంటకు బస్సు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట డిపో మేనేజరలకు పలుమార్లు విజ్ఞప్తి చేయగా నాలుగేళ్ల తర్వాత ఇల్లంతకుంటకు ిపునః ప్రారంభమైంది. బస్సు ప్రారంభం కావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కే భాస్కర్‌ రెడ్డి, నాయకులు గుడిసె ఐలయ్య, మామిడి సంజీవ్‌, నాగరాజు శర్మ, మామిడి నరేశ్‌, బిళ్లవేని రమేశ్‌, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు మందరాజు, తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాలక్రైం: జగిత్యాల నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నల్ల స్వామిరెడ్డిపై పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో 35మంది అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీతో సంబంధం లేకుండా.. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పనిచేసి.. ప్రస్తుతం అధికార దాహంతో కాంగ్రెస్‌ బీఫామ్‌లు తెచ్చుకుని.. కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పడం సరికాదని కరపత్రాలు ముద్రించి న్యూస్‌పేపర్ల ద్వారా పంపిణీ చేశారు. దీనిపై 23వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి బోనగాని ఉషశ్రీ ఫిర్యాదు మేరకు స్వామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇసుక లారీ పట్టివేత

ఇబ్రహీంపట్నం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. మల్లాపూర్‌ మండలకేంద్రానికి చెందిన లారీ యజమాని ఇస్లావత్‌ శంకర్‌, డ్రైవర్‌ బూక్య వంశీ వేంపల్లి శివారు గోదావరి నది నుంచి లారీలో ఇసుకను అనుమతి లేకుండా నింపుకొని తరలిస్తుండగా ఇబ్రహీంపట్నంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద పట్టుకున్నామని, గ్రామ పంచాయతీ అధికారి సుంకం తిరుపతి ఫిర్యాదు మేరకు లారీ యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మదర్‌ థెరిసా ఇంజనీరింగ్‌ కాలేజీలో టాస్క్‌ ఆధ్వర్యంలో డీబీఎంఎస్‌ ప్రోగ్రామింగ్‌ విత్‌ ఎస్‌క్యూఎల్‌ అనే అంశంపై మూడురోజుల వర్క్‌షాప్‌ సోమవారం ప్రారంభమైంది. డీబీఎంఎస్‌ ప్రోగ్రామింగ్‌ విత్‌ ఎస్‌ క్యూ ఎల్‌కి సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు కల్పించినట్లు రిసోర్స్‌ పర్సన్‌ రత్నప్రియ తెలిపారు. ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ఏవో పవన్‌కుమార్‌, అకడమిక్‌ ఇన్‌చార్జి ఇజాజ్‌ఖాన్‌, హెచ్‌వోడీ శశికాంత్‌, నవ్య, షాకీర్‌, శిరీష పాల్గొన్నారు.

బీఏ, బీకాం, బీఎస్సీ ఫలితాలు విడుదల

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నవంబర్‌– 2025లో జరిగిన యూజీ (సీబీసీఎస్‌) (ఆర్‌19) మొదటి సెమిస్టర్‌ (బ్యాక్‌లాగ్‌), మూడవ, ఐదవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్‌ తెలిపారు. www. satavahana.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

ఇల్లంతకుంటకు   బస్సు ప్రారంభం1
1/1

ఇల్లంతకుంటకు బస్సు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement