పెట్టుబడులపై అవగాహన
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సోమవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అధ్యాపకులు మహేశ్, జగన్నాథం, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ, వక్త గణేశ్ మాట్లాడారు. భవిష్యత్‌లో డబ్బులు సంపాదించడం ఎలా, వాటిని ఏ విధంగా పొదుపు చేస్తే లాభాలు ఆర్జించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శాస్త్రవేత్తకు డాక్టరేట్
కరీంనగర్‌రూరల్: ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేసిన కల్వల శేఖర్‌కు వ్యవసాయ విద్యలో పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ సాత్నకోత్సవంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రభు పింగళి పట్టాను అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్న శేఖర్.. ఉత్తర తెలంగాణలోని నేలల్లో అధిక భాస్వరం తగ్గించి చేసే యాజమాన్య పద్ధతులు, ప్రధాన పంటలను ప్లాంటర్‌తో ఎత్తు మడుల్లో సాగు చేస్తే అధిక వర్షాలు, తేమ తక్కువగా ఉన్న సందర్భాల్లో కలిగే పంట నష్టాలను కచ్చితంగా తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఫ్రొఫెసర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు.
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతిచెందాడు. టౌన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన అన్న వరుణ్ (26) సోలార్ సిస్టం కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఓ వ్యక్తి ఇంటిపై సోలార్ సిస్టం అమర్చేందుకు స్లాబ్‌పైకి ఎక్కిన క్రమంలో ఇంటిపై నుంచి వెళ్లే 11 కేవీ వైర్లు తాకి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన ఇంటి యజమాని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి అన్న వినయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
మేడిపల్లి: బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తొంబర్రావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం.. తొంబర్రావుపేటకు చెందిన సంగ రాజు (52) కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు కుమారుడు రమేశ్, కూతురు ధరణి ఉన్నారు. సంగ రాజు భర్త చిన్న భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
పెట్టుబడులపై అవగాహన


