శ్రీచైతన్య విద్యార్థులకు ఘన స్వాగతం
కరీంనగర్‌టౌన్: మంకమ్మతోటలోని శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్‌సీసీ విద్యార్థులకు కరీంనగర్‌లో ఘన స్వాగతం లభించింది. కళాశాలకు చెందిన బి.సంధ్య, కె.అజయ్ అనే విద్యార్థులు 2026 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే క్యాంపునకు ఎన్నికయ్యారు. సుమారు 40 రోజులపాటు శిక్షణ పొంది జనవరి 26న రాష్ట్రపతి, దేశ ప్రధాని సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కళాశాలకు చెందిన సంధ్య కర్తవ్యపత్ ర్యాలీలో, అజయ్ పీఎం ర్యాలీలో పాల్గొన్నారు. సోమవారం క్యాంప్ పూర్తి చేసుకొని వచ్చిన ఆ ఇద్దరితో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు 9టీ బెటాలియన్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పరేడ్లో తమ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సన్మానం చేసి యాజమాన్యం తరఫున రూ.25,000 చొప్పున నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణారెడ్డి, ఎన్‌సీసీపీఐ స్టాఫ్ పి.అశోక్, కేర్ టేకర్ జి.రాజేందర్, 9 తెలంగాణ బెటాలియన్ సుబేదారు విజయ్‌కుమార్, హవల్దార్ పీవీరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


