మహాజాతరకు పటిష్ట భద్రత
● ఎస్పీ మహేశ్ బీ గీతే
వేములవాడ: మహాశివరాత్రి జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. భీమన్న ఆలయంలో శుక్రవారం ప రిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తుల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. పట్టణంలోని ప్రధాన మార్గాల్లో రూట్‌మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఏఎస్పీ రుత్విక్‌సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై రాజు, ఆలయ ఈఈ రాజేశ్, డీఈ మహిపాల్‌రెడ్డి, ఏఈ రాంకిషన్‌రావు ఉన్నారు.
రగుడు చెక్ పోస్ట్ తనిఖీ
సిరిసిల్ల క్రైం: రగుడు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఎస్పీ మహేశ్ బీ గీతే శుక్రవారం తనిఖీ చేశారు. వాహన తనిఖీల రిజిస్టర్లు పరిశీలించారు. చెస్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
8న కరీంనగర్‌లో ఐటీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం
కరీంనగర్: జిల్లాలోని యువతకు ఐటీరంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కోడింగ్ ట్యూటర్ ఆధ్వర్యంలో ఐటీ జాబ్‌మేళా, ఇంటర్న్‌షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం ఉదయం 10 గంటలకు, కరీంనగర్‌లోని శ్వేత హోటల్‌లో కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఐటీ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, కంపెనీలు ఏ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి... గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఎలా సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.. ఇంటర్న్‌షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాలను ఫణిరాజ్ జాలిగామ వివరించనున్నారు. ఈ కార్యక్రమం డిగ్రీ/ఇంజినీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 89888 87333 నంబర్‌కి ఫోన్‌చేసి తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికే ప్రవేశం కల్పించబడుతుందన్నారు.


