సంజీవయ్య జీవితం ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

సంజీవయ్య జీవితం ఆదర్శం

Feb 15 2026 6:46 AM | Updated on Feb 15 2026 6:46 AM

సంజీవ

సంజీవయ్య జీవితం ఆదర్శం

● జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ ● బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

● జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌

సిరిసిల్లటౌన్‌: అట్టడుగు వర్గాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన దామోదరం సంజీవయ్య భావితరాలకు స్ఫూర్తి అని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, శాలివాహన రాష్ట్ర నాయకులు నెల్లుట కనకయ్య, ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి దశరథం, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ అధ్యక్షులు కంసాల మల్లేశం, నాయకులు రెడ్డిమల్ల భాను, కొంపెల్లి విజయ్‌కుమార్‌, బిట్ల ప్రసాద్‌, పంగ రవి, సిరిగిరి రమేశ్‌, పెరుమాండ్ల సంతోష్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ హామీలు అమలు చేసే వరకు పోరాడుతాం

వేములవాడ: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అమలు చేసే వరకు పోరాడుతామని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. పద్మశాలీ సంఘంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఇవ్వకుండా తగిన గుణపాఠం చెప్పారన్నారు. బీజేపీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్‌, రేగుల రాజ్‌కుమార్‌, వాసం మల్లేశంయాదవ్‌, వెంకన్న, నర్సయ్య, బిళ్ల కృష్ణ, శ్యాంసుందర్‌, నామాల శేఖర్‌ పాల్గొన్నారు.

22న గురుకుల ప్రవేశ పరీక్ష

సిరిసిల్ల అర్బన్‌: తెలంగాణ సంక్షేమ గురుకులంలో 2026–27 సంవత్సరానికి 5, 6, 7, 8, 9 తరగతులలో మిగిలిన సీట్లలో ప్రవేశానికి ఈనెల 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల సమన్వయ అధికారి థెరిస్సా తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల వరకు కేటాయించిన పరీక్ష సెంటర్లకు చేరుకోవాలన్నారు. హాల్‌టికెట్‌తోపాటు అఫ్లికేషన్‌ ఫారం, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ వెంట తీసుకుని రావాలని సూచించారు.

కవితల పోటీల్లో విశ్వసాహితీ ప్రశంసాపత్రం

సిరిసిల్లఅర్బన్‌: జాతీయ సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీల్లో పెరుక రాజుకు ప్రశంసాపత్రం లభించింది. ఈ పోటీల్లో సుమారు 400 మంది కవులు పాల్గొనగా 20 కవితలను ఎంపిక చేశారు. పెరుక రాజు మొదటి వరుసలో నిలిచి విశ్వసాహితీ కళావేదిక ప్రశంసాపత్రం అందుకున్నట్లు తెలిపారు.

కోతులు పట్టేందుకు విరాళం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లిలో కోతుల బెడదను తప్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కుల సంఘాల వారీగా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఈమేరకు శనివారం సర్పంచ్‌ కొండ రమేశ్‌గౌడ్‌కు యాదవసంఘం ప్రతి నిధులు రూ.20వేలు అందజేశారు. కోతులను పట్టేవారితో ఇప్పటికే రూ.3.40 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.

సంజీవయ్య జీవితం ఆదర్శం
1
1/1

సంజీవయ్య జీవితం ఆదర్శం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement