బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

● జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌

● జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల/వేములవాడ: ఎన్నికల సిబ్బంది బాధ్యతా యుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌ సూచించారు. వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల అధికారు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. ఆర్డీవో రాధాబాయి, ట్రై నింగ్‌ నోడల్‌ అధికారి శ్రీనివాసాచారి, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌ ఉన్నారు.

జూనియర్‌ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌

వేములవాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, స్థానిక సినారె కళామందిర్‌లో రిసెప్షన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈనెల 7, 8 తేదీల్లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్‌ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నోడల్‌ అధికారి మల్లికార్జునరావు, ట్రైనర్‌ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అనదపు కలెక్టర్‌ నగేశ్‌, ఏఎస్పీ చంద్రయ్యలతో కలిసి సమీక్షించారు. ఫస్టియర్‌ 4,046, సెకండియర్‌ 4,060 మంది హాజ రవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. డీఐఈవో శరత్‌కుమార్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు వేణు పాల్గొన్నారు.

అక్రిడిటేషన్‌ కార్డులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

2026–2028 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చే యాలని జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడున్న అక్రిడిటేషన్‌ కార్డుల కాలపరిమితి ఈనెల 28తో ముగియనుందని, అర్హత గల జర్నలిస్టులకు కొత్తకార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కోరారు.

భక్తులు ఇబ్బందులు పడొద్దు

మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. భీమేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లను అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌, ఆర్డీవో రాధాభాయితో కలిసి పరిశీలించారు. వీఐపీ దర్శనాల కోసం చేసిన ప్రత్యేక ద్వారం, బారికేడ్లను పరిశీలించిన ఈఈ రాజేశ్‌కు సూచనలు చేశారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ప్రసాదం కౌంటర్‌ ఏర్పా టు చేయాలని సూచించారు. మొబైల్‌ టాయిలెట్ల సంఖ్య పెంచాలన్నారు. కోడెల టికెట్‌ కౌంటర్‌, పందిర్లు, శివార్చన స్టేజీ పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలన్నారు. ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్‌, డీఈ రఘునందన్‌, తహసీల్దార్‌ జయంత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement