ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోయింది
● అంధ విద్యార్థికి పీహెచ్‌డీలో అడ్మిషన్ ● సోదరులిద్దరూ అంధులే..
ఇల్లంతకుంట(మానకొండూర్): పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు అంధ విద్యార్థి అజిత్‌కుమార్. పీహెచ్‌సీ ప్రవేశ పరీక్షలో 75 శాతంతో ఉత్తీర్ణత సాధించి పీహెచ్‌డీ అడ్మిషన్‌కు అర్హత సాధించాడు. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన ఎలగందుల అజిత్‌కుమార్ పుట్టుకతో అంధుడు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో సోషియలాజీలో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించి పీహెచ్‌డీ అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష రాశారు. ఇతని తమ్ముడు ఎలగందుల రంజిత్‌కుమార్ కూడా అంధుడే. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఇతను పదో తరగతిలో రాష్ట్రంలో అంధ విద్యార్థులలో 8.7 గ్రేడ్ సాధించారు. అప్పుడు మంత్రి సీతక్క చేతుల మీదుగా రూ.5వేల ప్రభుత్వ పారితోషకం అందుకున్నారు. వీరిద్దరూ ఇల్లంతకుంట ఏఎంసీ వైస్‌చైర్మన్ ఎలగందుల ప్రసాద్ కుమారులు.


