మనస్సు ఊరుకో‘లేఖ’
ఓటరూ.. ఒక్క మాట
బతుకులు మారాలి.. బాధలు తీరాలి
సంధించు.. నీ ఓటు అస్త్రం
సిరిసిల్ల: అగో.. అప్పుడే తెల్లారుతోంది.. చలి గాలి వీస్తుంది.. సూర్యకిరణాలు నేలను తాకుతున్నాయి. మంచుదుప్పటి తొలగిపోతుంది. క్షణాలు గడుస్తున్నాయి. కాలం కరిగిపోతుంది.. మరో ఐదేళ్లపాటు మనల్ని పాలించే మున్సిపల్ కౌన్సిలర్లను ఎన్నుకునే అరుదైన అవకాశం రానే వచ్చింది. ఈ రోజు ఓట్ల పండగ. ఈ ఒక్క రోజు నువ్వే రాజువి.. నువ్వే మంత్రివి. శ్రీనిస్వార్థ ప్రజాసేవకున్ని ఎన్నుకోండి..శ్రీ మీ సమస్యలను తన సమస్యలుగా భావించే వారికి ఓటువేయండిశ్రీ.. అంటూ.. వారం రోజులుగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా మైకు పెట్టి మరీ చెప్పారు. వాళ్లు చెప్పిన మాటలు.. వాగ్దానాలు మీ మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. నేతలంతా ఓటరు చుట్టూ చేరి.. చేతులు జోడించి ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే అరుదైన అవకాశం ఇదే. మరి లే.. నువ్వే లెవ్వు.. లేచి నిర్లక్ష్యాన్ని వీడు.. మీ పోలింగ్ కేంద్రం వైపు ఇగ నడువు.. నీ ఓటు అస్త్రాన్ని సంధించు.. నీ ఓటు ఓ మంచి పాలనకు బాట అవ్వాలి. స్వార్థపరులకు వేటు కావాలి. మన వీధిని.. మన వాడను బాగు చేసే అభ్యర్థికి ఓటు వెయ్యి. ఇయ్యాల ఓట్లు వేసే రోజు కావడంతో నా మనసు ఊరుకో లేక ఇదంతా చెబుతున్నా..! ఇంతకీ నేను ఎవరో మీకు చెప్పనే లేదు కదా.. మీరంతా అప్పుడప్పుడూ వచ్చే మీ మున్సిపల్ ఆఫీస్‌ను.
మీ పొరపాటు.. కావద్దు చేటు..
నేతల మాటల గారడి.. అరచేతిలో వైకుంఠం చూపించేవారిని నమ్మకండి. వెయ్యికో, రెండు వేలకో.. మద్యం సీసాకో, బిర్యాణీకో.. ఓ చీర, వెండి కై న్‌కో మీ విలువైన ఓటును అమ్మకండి. అందుకే చెబుతున్నా.. తస్మాత్ జాగ్రత్త. 72 ఏళ్లుగా మిమ్మల్ని.. నన్ను పాలిస్తున్న నేతలు ఏం ఒ రగబెట్టారు. ‘నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రలు అయినట్లు.’ మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు.. వా ళ్ల ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. కులం, మ తం, ప్రాంతం, ప్రగతి పాఠాలను బోధిస్తూ మీ ముందుకొచ్చిన నేతల అసలు రూపాలను గమనించండి. స్వార్థపరులు, అవినీతి పరులకు ఓ ట్లు వేసి నా దగ్గరికి పంపిస్తే, మీకు ఐదేళ్లు బాధలు తప్పవు. మీకు సేవ చేసే నిస్వార్థ నాయకున్ని ఎన్నుకోండి. ఆత్మసాక్షిగా ఓటును వేయండి. ఏ పార్టీ వాడన్నది ముఖ్యం కాదు.. ఏపాటివాడో అని ఆలోచించండి. మన వీధులకు సి మెంట్ రోడ్లు, మురికి కాల్వలు, నల్లానీరు, వంటి వసతులు కావాలి. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలి.మీ క్షేమం, నా అభివృద్ధిని చూసుకునే మంచి నేతలు అందలమెక్కాలి. అన్నీ ఆలోచించి బ్యాలెట్ పత్రంపై ఓటు వేయండి.
ఆఖరు మాట
చివరగా ఒక్క మాట.. పోటీలో ఉన్నవాళ్లలో మంచి అభ్యర్థిని గుర్తించండి. ఎప్పుడైనా మీ బాగోగులు చూసుకునే ఆత్మీయుడికి పట్టం కట్టండి. మీ అంతరాత్మ ‘సాక్షి’గా ఓటు వే యండి. ఇక లేవండి.. ఓటేసేందుకు టైమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లి వచ్చే ఐదేళ్లకు పురపాలకులను ఎన్నుకోండి. ఇంతసేపు మీ అమూల్య మైన సమయాన్ని వెచ్చించి నా విన్నపాన్ని విన్న మీ అందరికీ పది వేల దండాలు.. ఇక ఉంటాను. ఇట్లు
మీ అందరి సంక్షేమాన్ని కోరే మీ..
మున్సిపల్ ఆఫీస్
మనస్సు ఊరుకో‘లేఖ’


