కళకు జీవితమిస్తే.. | - | Sakshi
Sakshi News home page

కళకు జీవితమిస్తే..

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

కళకు జీవితమిస్తే..

కళకు జీవితమిస్తే..

కళకు జీవితమిస్తే..

ఇరవై ఐదేళ్లు.. ఇదొక సాధారణ కాలం కాదు. కళనే శ్వాసగా, పాటనే ఆయుధంగా మలుచుకుని సాగించిన పోరాట కాలం. కమాన్‌పూర్‌ మండలం రొమ్మికుంట గ్రామానికి చెందిన పులిపాక బాలయ్య అనే కాళాకారుడు కళాకారుడిగా అనేక సేవలు చేశాడు. పాటలు రాయడం నుంచి వేదికలపై పాడటం వరకూ ప్రజల మధ్య చైతన్యం నింపే కార్యక్రమాల నుంచి సామాజిక సందేశాల వరకూ అన్ని రకాల ప్రోగ్రామ్స్‌ చేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉద్యమ గీతాల ద్వారా ప్రజల గుండెల్లో స్పందన రేపాడు. ఉద్యమాల వేడి వేదికలపై కనిపించినా.. జీవితంలో కష్టాలే ఎదురయ్యాయి. ఇంతకాలం కళకు అంకితమై ఉన్నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వెంటాడుతోంది. ప్రస్తుతం సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తూ,చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కళాకారుడి ప్రతిభను చూసే సమాజం, అతడి బతుకును చూడడం మరిచిపోతుందంటున్నాడు. ఉద్యమాల సమయంలో అవసరమైన కళాకారులు.. ఆ ఉద్యమం ఫలించిన తర్వాత పక్కన పడిపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించాలని, కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరుతున్నాడు.

– పులిపాక బానయ్య, పాటల రచయిత, కమాన్‌పూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement