సిరిసిల్ల అభివృద్ధి మా బాధ్యత | - | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల అభివృద్ధి మా బాధ్యత

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

సిరిసిల్ల అభివృద్ధి మా బాధ్యత

సిరిసిల్ల అభివృద్ధి మా బాధ్యత

● మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

సిరిసిల్ల/వేములవాడ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదు.. ఇబ్బందుల పాలు చేస్తుంది.. అయినా.. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసిగా పని చేస్తుందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని రాష్ట్ర వ్యవసా య, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద మున్సిపల్‌ ఎన్నికల ప్ర చార సభలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్‌తో కలిసి ప్రసంగించారు. నేతకార్మిక సంక్షేమానికి నిధులు విడుదల చేయకుండా గత ప్ర భుత్వం నిర్లక్ష్యం చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.350 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. నేతన్న సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఇది కేటీఆర్‌ అహంకారానికి, పేదల ఆత్మగౌరవానికి పోటీ అని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌కు పట్టంకట్టి ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి గౌరవాన్ని కాపాడాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, నేతన్నలకు దీర్ఘకాలిక మేలు జరగాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ, సిరిసిల్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసి సీఎంకు గిఫ్ట్‌ ఇవ్వాలన్నారు. విప్‌ ఆది మాట్లాడుతూ, పద్మశాలీ భవనం, మార్కండేయ ఆలయం పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

సీఎం తర్వాత అధికారం మీ సీనన్నకే

‘సీఎం తర్వాత మీ ఆది సీనన్నదే అధికారమని, వే ములవాడ అభివృద్ధికి ఆది అడిగితే ఎవరైనా చేయాల్సిందే’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అ న్నారు. ఆదివారం పట్టణంలోని సుభాష్‌నగర్‌ చౌరస్తాలో రోడ్‌షోలో ప్రసంగించారు. వచ్చే మూడేళ్లలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అ ధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ వెల్ము ల స్వరూపారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, అభ్యర్థులు ఇప్పపూల మమత, నీలం మమత, సిరిగిరి సంగీత, సాగారం వెంకటస్వామి, మస్తాన్‌, నాయకులు శ్రీనాథ్‌, నర్సయ్య, సూర దేవరాజు, చక్రధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement