ఎవరికెవరు ఏమవుతారో..?!
జగిత్యాలటౌన్: జగిత్యాల బల్దియా ఎన్నికల ప్రచారంలో వింత పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి తన అనుచరులైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఎర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీంతో ఓట ర్లు విస్తుపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పా ర్టీ ఫిరాయింపుపై ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్‌ను కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని మీడియా ముఖంగా ప్రకటించిన ఎమ్మె ల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అధికార పార్టీ సీనియర్ నాయకుడు స్వతంత్రులకు మద్దతుగా ప్రచారం చేస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
‘ఉపాధి’ ప్రచారం
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఎన్నికలు అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పెద్దపల్లిలో పలువురు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థిగా ముందుకొచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కళాబృందాలతో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారశైలిని చూసిన ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులు.. మంథని ప్రాంతం నుంచి కళాకారులను రప్పించి ప్రచారం హోరెత్తిస్తున్నారు.
వార్డుల్లో ప్రచారం చేస్తే రూ.200
పలువురు అభ్యర్థులు తమగుర్తుతో వార్డుల్లో ప్రచారం చేసేందుకు అదేవార్డుకు చెందిన వారితోనే తిరుగుతున్నారు. వీధుల్లో జెండాలు పట్టుకుని రెండుగంటల పాటు ఇలా తిరిగితే ఒక్కొక్కరికి రూ.200 ఇస్తున్నారు. ఇలాంటి ప్రజలు పొద్దున ఒకరికి, మధ్యాహ్నం మరొకరిని, రాత్రిపూట ఇంకొకరికి వారివారి జెండాలు, గుర్తులు పట్టుకుని ‘జై అభ్యర్థి.. జై పార్టీ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయం గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు జనాల్ని పోగేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మీరు మాతో ప్రచారానికి రండి అని అడిగితే.. ‘ఇప్పుడు పలానా అభ్యర్థికి మద్దతుగా వెళ్తున్నాం.. మీరు రెండు గంటల తర్వాత ప్రచారం చేసుకోండి’ అంటూ అభ్యర్థులకు స్థానిక ప్రజలు సూచిస్తున్నారు. ఓట్ల పండుగ పుణ్యాన మహిళలకు ఇలా రోజుకు కనీసం రూ.600 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది.
పెద్దపల్లిరూరల్: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎత్తులు, పైఎత్తులు వేస్తుంటారు. కానీ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి.. తమకు మద్దతుగా 150 మందిని సమీకరించారు. తన వార్డులో శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. కానీ, వారందరినీ సమీపంలోని మరోవార్డు అభ్యర్థి.. తన మద్దతుదారుల కోసం ఏర్పాటు చేసుకున్న భోజనం తినేందుకు పంపించాడు. అదే సమయంలో ఆ అభ్యర్థి మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. వీరంతా ఎవరు? ఎందుకొస్తున్నారోనని సదరు అభ్యర్థితో సహా ఆయన మద్దతుదారులెవరికీ అంతుబట్టలేదు. ‘మిమ్మల్ని ఎవరు పంపించారు’ అని ఆరా తీయగా.. పొరుగువార్డుకు చెందిన ఓ నాయకుడని తేలింది. ‘మీ అందరికీ తలా రూ.200 చొప్పున డబ్బులు ఇవ్వమని అతడికి డబ్బులు ఇచ్చా.. మీరంతా ఆయన వద్దకే వెళ్లి తీసుకోండి’ అని చెప్పి వెనక్కి పంపిచేశాడు. ‘అరే.. మా అవసరానికి తగ్గట్టుగా భోజనం సిద్ధం చేసుకుంటే.. మాకు సంబంధం లేనివ్యక్తులను ఇలా పంపడమేంటో’ అని సదరు అభ్యర్థి వాపోయాడు. ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.
ఒకరి ప్రచారం.. మరొకరి భోజనం!
అధికార పార్టీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రచారం
స్వతంత్రులకు అధికార పార్టీ నాయకుడి ప్రచారం
జగిత్యాలలో వింత పరిస్థితి
ఎవరికెవరు ఏమవుతారో..?!
ఎవరికెవరు ఏమవుతారో..?!
ఎవరికెవరు ఏమవుతారో..?!


