● నవోత్సాహంలో యువత ● అనుభవాలు చెప్పిన వృద్ధులు
గతంలో కంటే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. పోలింగ్ బూతుల్లో వసతులు కల్పించారు. మా రోజుల్లో ఇలా వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఇప్పుడు సహాయకులను అందుబాటులోకి తేవడం మంచిగుంది.
– ఆకునూరి కిష్టయ్య, అంబేడ్కర్‌నగర్
హైదరాబాద్‌లో బీటెక్ థర్డియర్ చదువుతున్నా. ఓటుహక్కు వినియోగించుకోవడం బాధ్యత కాబట్టి వచ్చాను. నిజాయితీపరులను ఎన్నుకునేందుకు రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి.
– రాపెల్లి రాజ్‌కుమార్, బీటెక్ విద్యార్థి
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఓటేస్తాను. నాకు చేతకాకపోయినా నా కుటుంబ సభ్యుల సహాయంతో ఓటేస్తాను. ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ ఓటు వేయడం సంతోషంగా ఉంది.
– కౌసల్య, చంద్రంపేట
● నవోత్సాహంలో యువత ● అనుభవాలు చెప్పిన వృద్ధులు
● నవోత్సాహంలో యువత ● అనుభవాలు చెప్పిన వృద్ధులు


