కోరుట్లలో వెండి ప్రతిమలు పట్టివేత
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల తనిఖీల్లో భాగంగా స్సెషల్ టీం అదికారులు కోరుట్లలోని ఓ వార్డులోని ఓ ఇంట్లో తనిఖీలు చేశారు. ఓటర్లకు పంపిణీ చేయటానికి సిద్ధంగా ఉన్న 712 శ్రీవేంకటేశ్వర స్వామి వెండి పూత ప్రతిమలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వార్డుకు చెందిన వ్యక్తి ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వెండి ప్రతిమలు తెప్పించారనే సమాచారంతో ఎన్నికల ప్రత్యేక తనిఖీ బృందం సోదాలు చేసింది. వెండిపూత బిల్లలతో, జీసస్ ఫొటోఫ్రేమ్స్, 270 ఫిట్‌బాక్సులు పట్టుబడ్డాయి. పట్టణంలో స్పెషల్ టీం వాహన తనిఖీల్లో రూ.60 వేలు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.


