ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

వేములవాడ: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ రుత్విక్‌సాయి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వేములవాడలో స్పెషల్‌ పోలీసు బలగాలతో తిప్పాపూర్‌ బస్టాండ్‌ నుంచి మేయిన్‌రోడ్డు గుండా మార్కెట్‌యార్డు జంక్షన్‌ వరకు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించామన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. టౌన్‌ సీఐ వీరప్రసాద్‌, ఆర్‌ఐ సురేశ్‌, ఎస్సైలు రామ్మోహన్‌, రాజు, శ్రావణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement