భీమన్నకు పట్టువస్త్రాలు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరీ సేవా సమితి భక్తి కార్యక్రమం రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భీమేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు బద్దిపోచమ్మ అమ్మవారికి సారెను శనివారం సమర్పించారు. ఆలయ ఈవో రమాదేవి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఏఈవోలు శ్రావణ్‌కుమార్, అశోక్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివసాయి, పురాణం వంశీ పాల్గొన్నారు.
అత్యవసర వేళల్లో అందుబాటులో ఉండాలి
సిరిసిల్లటౌన్: క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చే అత్యవసర సమయాల్లో 108 సిబ్బంది అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో రజిత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను శనివారం తనిఖీ చేపట్టారు. అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ వాహనం వచ్చిన సందర్భంగా వాహనంలోని అత్యవసర సమయంలో ఉపయోగించే పరికరాల పనితీరును పరిశీలించారు. శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్‌కు సూచించారు. 108 జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, వడ్నాల అనిల్‌కుమార్, పోచంపల్లి పర్శరాములు, బండారి స్వాతి, బుర్ర వెంకటేశ్ పాల్గొన్నారు.
కొదురుపాకలో స్థల పరిశీలన
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాకలో బస్టాండ్ నిర్మాణానికి కరీంనగర్ ఆర్టీసీ ఆర్‌ఎం రాజు శనివారం స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో బస్టాండ్, బస్టాప్ నిర్మాణం గురించి కొదురుపాక సర్పంచ్ కత్తెరపాక మంజుల ఆధ్వర్యంలో ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మంత్రి సూచనలతో ఆర్‌ఎం కొదురుపాకలో స్థలాన్ని పరిశీలించారు.
మహాశివరాత్రి జాతరకు ప్రత్యేక బస్సులు
వేములవాడఅర్బన్: వేములవాడలో మూడు రోజులు జరిగే మహాశివరాత్రి జాతరకు 600 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు తెలిపారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం సమావేశమయ్యారు. కరీంనగర్–వేములవాడ రూట్‌లో 58 బస్సులు, కోరుట్ల –వేములవాడ 38, మెట్‌పల్లి–వేములవాడ 69, జేబీఎస్–వేములవాడ 49, వేములవాడ–కొండగట్లు 15, వరంగల్–వేములవాడ 131, వేములవాడ–సిరిసిల్ల 18, నిర్మల్–వేములవాడ 85, ఆర్మూర్–వేములవాడ 90, నిజామాబాద్–వేములవాడ 22, కామారెడ్డి–వేములవాడ 25 బస్సులు నడిపించనున్నట్లు వివరించారు. డిపో మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు.
ప్రశ్నించే గొంతుక సీపీఎం
సిరిసిల్లటౌన్: మున్సిపాలీటీలో ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతుకై న సీపీఎంను ఆదరించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కై లాబ్‌బాబు కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం సిరిసిల్లలో ప్రచారం చేశారు. సీపీఎం పోరాటంతోనే సుందరయ్యనగర్, బీవై నగర్‌లలో పేదలకు ఇళ్లు దక్కాయన్నారు. పవర్‌లూమ్ కార్మికుల కూలి కోసం పోరాడామని గుర్తు చేశారు. 21వ వార్డు కోడం రమణ, 33వ వార్డు ఎలిగేటి రాజశేఖర్, 34వ వార్డు రాపెల్లి రమేశ్‌లను గెలిపించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, ఎర్రవల్లి నాగరాజు, గురిజాల శ్రీధర్, సూరం పద్మ పాల్గొన్నారు.
భీమన్నకు పట్టువస్త్రాలు
భీమన్నకు పట్టువస్త్రాలు
భీమన్నకు పట్టువస్త్రాలు


