మహిళలకు ఫ్రీ బస్సుపై కేటీఆర్ వ్యతిరేకం
సిరిసిల్ల అర్బన్: మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడంపై కేటీఆర్ పదే పదే తప్పుపడుతున్నారని, ఫ్రీ బస్సు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారా? అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అడిగారు. జ్యోతినగర్‌లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఎలుక తిరుపతి పాల్గొన్నారు.


