ప్రచారం బంద్
48
కలెక్టర్ గరీమా అగ్రవాల్
గంటల ముందే
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలు ప్రణాళికతో పూర్తి చేయాలని, ప్రచారాన్ని పోలింగ్‌కు 48 గంటల ముందే బంద్ చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, నోడల్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, పోలింగ్ కేంద్రం బయట ఒక సీసీ కెమెరా ఉండాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, మచ్చ గీత, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్, తహసీల్దార్లు మహేశ్‌కుమార్, జయంత్‌కుమార్, అధికారులు ప్రవీణ్, మీర్జా ఫసహత్ అలీ బేగ్, అన్సార్ పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించాలి
సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు 13న జరుగుతుందని, ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో కౌంటింగ్ విధులపై ఆర్వో, ఏఆర్వోలు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చారు. సిరిసిల్ల, వేములవాడల్లోని సినారె కళామందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్, తర్వాత వార్డుల వారీగా ఓట్లు లెక్కించాలని సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధులకు హాజరయ్యే వారు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్‌లోని ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆదివారం కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. నోడల్ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.


