కాంగ్రెస్‌తోనే బీసీలకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే బీసీలకు న్యాయం

Feb 8 2026 4:24 AM | Updated on Feb 8 2026 4:24 AM

కాంగ్రెస్‌తోనే బీసీలకు న్యాయం

కాంగ్రెస్‌తోనే బీసీలకు న్యాయం

● మాజీ ఎంపీ వి.హనుమంతరావు

సిరిసిల్లటౌన్‌/వేములవాడ: కాంగ్రెస్‌ పాలనలోనే బీసీలకు, మహిళలకు న్యాయం జరిగిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో శనివారం ప్రచారం చేశారు. వేములవాడను జర్మనీ రమేశ్‌బాబుతో వెనుకపడేశారని, వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ఆది శ్రీనివాస్‌ ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారన్నారు. వేములవాడలో విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి ప్రచారం చేశారు.

నాయకులు నాగుల సత్యనారాయణగౌడ్‌, సంగీతం శ్రీనివాస్‌, చొప్పదండి ప్రకాశ్‌, ఆకునూరి బాలరాజు, చీటి ఉమేశ్‌రావు, గడ్డం నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement