నువ్వక్కడ.. నేనిక్కడ! | - | Sakshi
Sakshi News home page

నువ్వక్కడ.. నేనిక్కడ!

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 7:34 AM

నువ్వ

నువ్వక్కడ.. నేనిక్కడ!

బల్దియా బరిలో భార్యాభర్తలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచేందుకు భార్యభర్తలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేర్వేరు డివిజన్లలో భార్యాభర్తలు పోటీచేసి గెలుపొందిన సంఘటనలు గతంలో ఉండగా, ఈ సారి నగరంలో మూడు జంటలు బల్దియా పోరులో నిలిచాయి. బీఆర్‌ఎస్‌ నుంచి 47వ డివిజన్‌లో మాజీ డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, ఆమె భర్త బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ 21వ డివిజన్‌ నుంచి పోటీచేస్తున్నారు. 58వ డివిజన్‌ నుంచి దుడ్డెల శ్రీధర్‌, 57వ డివిజన్‌ నుంచి ఆయన భార్య దుడ్డెల మంజుల పోటీకి దిగారు. బీజేపీ నుంచి టికెట్‌ ఆశించిన వీరు, దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 46వ డివిజన్‌ నుంచి మాజీ కౌన్సిలర్‌ వరాల నారాయణ, 13వ డివిజన్‌ నుంచి ఆయన భార్య వరాల అనసూయ స్వతంత్రులు పోటీపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించినప్పటికి, రాకపోవడంతో స్వతంత్రులుగా పోటీలో నిలిచారు.

నువ్వక్కడ.. నేనిక్కడ!1
1/3

నువ్వక్కడ.. నేనిక్కడ!

నువ్వక్కడ.. నేనిక్కడ!2
2/3

నువ్వక్కడ.. నేనిక్కడ!

నువ్వక్కడ.. నేనిక్కడ!3
3/3

నువ్వక్కడ.. నేనిక్కడ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement