ఆరుగురు బంగారం దొంగలు, వ్యాపారి అరెస్ట్
మెట్‌పల్లి: మెట్‌పల్లి ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు నిందితులు.. వారు తెచ్చిన సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో మెట్‌పల్లి ప్రాంతంలో ఆరుచోట్ల దొంగతనాలు జరిగాయి. మెట్‌పల్లి శివారులో వన్నెల గంగుపై పట్టపగలే దాడి చేసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఇలా వరుస దొంగతనాలు జరగడాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. నిందితుల కోసం డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు కిరణ్‌కుమార్, అనిల్, నవీన్‌తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మెట్‌పల్లి, నిజామాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్ట నిందితులను గుర్తించారు. అప్పటినుంచి వారి కోసం గాలిస్తుండగా గురువారం మెట్‌పల్లిలోని కొత్త బస్టాండ్ వద్ద పండుగ రమేశ్, పల్లెపు రమేశ్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారు ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులు గుంజె గంగాధర్, గంగమణి, గైని కిరణ్, పెద్దూరు మల్లేశ్వరితోపాటు దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న వ్యాపారి ఇందూరి రాకేశ్‌ను అరెస్ట్ చేశారు. వీరందరి నుంచి 15 తులాల బంగారు, 32తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతంగా చేధించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.
నిందితులపై అనేక కేసులు
అరెస్టయిన నిందితుల్లో నలుగురిపై గతంలో పలు స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కిరణ్‌పై 35, పండుగ రమేశ్‌పై 23, గంగాధర్‌పై 16, పల్లెపు రమేశ్‌పై 13 కేసులున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.
15 తులాల బంగారం,
32 తులాల వెండి స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ అశోక్‌కుమార్


